AP Elections Amanchi Krishnamohan.. : కాంగ్రెస్‌లోకి ఆమంచి కృష్ణమోహన్..
ఆమంచి కృష్ణమోహన్ పోటీపై సస్పెన్స్ వీడింది. త్వరలో కాంగ్రెస్‌లో చేరి.. చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానంటున్నారు ఆయన. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అటు.. పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలో టిక్కెట్లు వెతుక్కుంటున్నారు. […]