Pushpa 2: పతాక సన్నివేశాల్లో… ‘పుష్ప2’
ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. చిత్రీకరణ దాదాపుగా తుది దశకు చేరుకొంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని తెరకెక్కించడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. ఈ వారం నుంచి రెండు వారాలుపైగానే పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతోపాటు, కొన్ని టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా… సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. […]