#Rohit Sharma: Rohit and Akash Ambani angry at Hardik! చిత్తుగా ఓడిన ఎంఐ.. హార్దిక్‌పై మండిపడ్డ రోహిత్‌, ఆకాశ్‌ అంబానీ!

IPL-2024 లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్‌. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతుంటే ఏ దశలోనూ కట్టడి చేయలేక చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. ముఖ్యంగా ట్రవిస్‌ హెడ్‌(24 బంతుల్లో 62), అభిషేక్‌ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్‌(28 బంతుల్లో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌(34 బంతుల్లో 80 నాటౌట్‌) ఊచకోతకు అడ్డుకట్ట వేయలేక ముంబై బౌలర్లు చేతులెత్తేయగా.. […]