Aditya-L1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం

ఆదిత్య-ఎల్‌1కు సంబంధించి ఇస్రో మరో కీలక విన్యాసం చేపట్టింది. ప్రస్తుతం లగ్రాంజియన్‌-1(ఎల్‌1) పాయింట్‌ దిశగా వెళుతున్న ఉపగ్రహ మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆదివారం వెల్లడించింది. దీని కోసం స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను 16 సెకన్ల పాటు మండించామని తెలిపింది. అక్టోబరు 6న చేపట్టిన ఈ విన్యాసం వల్ల ఉపగ్రహం వేగం పెరిగి ఎల్‌1 వైపు మరింత కచ్చితత్వంతో ప్రయాణిస్తోందని ఇస్రో పేర్కొంది.

The first mission undertaken by the ISRO to explore the secrets of the Sun, has revealed another milestone – సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది

సూర్యుడి(Sun) రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది. ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక(Space Carft) లగ్రాంజ్‌(Langrnge) పాయింట్‌-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ […]