Abhishek Singh : సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా

ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని  ధ్రువీకరించారు. నటన, మోడలింగుపై ఉన్న ఆసక్తితో అభిషేక్‌ ఇప్పటికే కొన్ని సినిమాలకు పనిచేశారు. సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. ఉన్నతాధికారులు ఆ వ్యవధిని 2018లో మరో రెండేళ్లు పెంచారు. అభిషేక్‌ ఆ సమయంలో మెడికల్‌ లీవ్‌ తీసుకొని విధులకు దూరంగా ఉన్నారు. […]