TDP: ప్రపంచంలో ఎక్కడున్నా ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఆనం వెంకటరమణారెడ్డి..

తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. నెల్లూరు: తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తితిదేకు చెందిన శ్రీవాణి ట్రస్టు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. […]