Cancer – మెరుగైన వైద్యం
క్యాన్సర్ బాధితులకు తక్కువ ఖర్చులో, వేగంగా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుగా కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు కీలక ఆవిష్కరణ చేపట్టారు. క్యాన్సర్ కణాలను సులభంగా అధ్యయనం చేసేందుకు త్రీడీ ముద్రిత విధానంలో కణితి నమూనాలను సృష్టించే విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందుకోసం అత్యాధునిక బయోప్రింటింగ్ సాంకేతికతలతోపాటు మైక్రోఫ్లూయిడిక్ చిప్‌లను ఉపయోగించారు. సంప్రదాయబద్ధ బయాప్సీ విధానంలో 2డీ కణితి నమూనాలు అందుబాటులో ఉంటాయని, వాటిని లోతుగా పరిశీలించడం కష్టమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాము అభివృద్ధి చేసిన […]