AP elections: వాటిని సాకుగా చూపి పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదు: ముకేశ్ కుమార్ మీనా
బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్‌వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్‌లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే […]