#Sport News

Title for Rithvik-Nicky Jodi : రిత్విక్‌–నిక్కీ జోడీకి టైటిల్‌ 

హైదరాబాద్‌: సాన్‌ లూయిస్‌ ఓపెన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్‌ రిత్విక్‌–నిక్కీ కలియంద పునాచా (భారత్‌) ద్వయం చాంపియన్‌గా నిలిచింది.

ఫైనల్లో రిత్విక్‌–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్‌–మార్క్‌ హ్యుస్లెర్‌ (స్విట్జర్లాండ్‌) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్‌ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్‌ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌. గత ఏడాది అక్టోబర్‌లో ఇటలీలో జరిగిన ఒల్‌బ్లా ఓపెన్‌లో అర్జున్‌ ఖడేతో కలిసి రిత్విక్‌ తొలిసారి చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను గెలిచాడు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *