Djokovic in the third round :మూడో రౌండ్లో జకోవిచ్

టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్, అయిదో సీడ్ మెద్వెదెవ్ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక, నాలుగో సీడ్ రిబకినా మూడో రౌండ్లోకి ప్రవేశించారు.
టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. నాలుగో సీడ్ జ్వెరెవ్, అయిదో సీడ్ మెద్వెదెవ్ కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక, నాలుగో సీడ్ రిబకినా మూడో రౌండ్లోకి ప్రవేశించారు.
టైటిల్ ఫేవరెట్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. గురువారం రెండో రౌండ్లో అతడు 6-4, 6-1, 6-2తో కర్బాలెస్ బయేనా (స్పెయిన్)పై విజయం సాధించాడు. తొలి గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నా.. ఆ తర్వాత జకోవిచ్‌కు ఎదురులేకుండా పోయింది. మ్యాచ్‌లో అతడు 5 ఏస్‌లు, 43 విన్నర్లు కొట్టాడు. మెద్వెదెవ్ (రష్యా), జ్వెరెవ్ (జర్మనీ) కూడా మూడో రౌండ్లో ప్రవేశించారు. మెద్వెదెవ్ 6-1, 5-0తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి కెచ్మనోవిచ్ (సెర్బియా) రిటైరయ్యాడు. జ్వెరెవ్ 7-6 (7-4), 6-2, 6-2తో గొఫిన్ (బెల్జియం)ను ఓడించాడు. తొలి రౌండ్లో నాదల్‌ను ఓడించిన జ్వెరెవ్.. రెండో రౌండ్లో 8 ఏస్‌లు, 37 విన్నర్లు కొట్టాడు. గొఫిన్ 5 డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ హర్కాజ్ (పోలెండ్) 6-7 (2-7), 6-1, 6-3, 7-6 (7-5)తో నకిషమ (అమెరికా)పై, పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-0, 6-3, 6-4తో మరోజ్‌సన్ (హంగేరీ)పై గెలిచారు.
మహిళల సింగిల్స్‌లో సబలెంక (బెలారస్) అలవోకగా మూడో రౌండ్లో అడుగుపెట్టింది. ఆమె 6-2, 6-2తో ఉచిజిమా (జపాన్)ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో సబలెంక నాలుగు ఏస్‌లు, 10 విన్నర్లు కొట్టింది. నాలుగో సీడ్ రిబకన (కజకిస్తాన్) 6-3, 6-4తో అరాంటా రస్ (నెదర్లాండ్స్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో అయిదో సీడ్ వొండ్రుసోవా (చెక్) 0-6, 6-1, 6-4తో వొలినెట్స్ (అమెరికా)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 6-4, 7-6 (7-3)తో ప్యారీ (ఫ్రాన్స్)పై, మ్యాడిసన్ కీస్ (అమెరికా) 6-0, 7-6 (9-7)తో షెరిఫ్ (ఈజిప్ట్)పై, సమనోవా 6-2, 6-1తో అనిసిమోవా (అమెరికా)పై, బదోసా (స్పెయిన్) 4-6, 6-1, 7-5తో పుతిన్‌త్సెవా (కజకిస్థాన్)పై విజయం సాధించారు. 11వ సీడ్ కోలిన్స్ (అమెరికా) 7-6 (7-5), 5-7, 4-6తో దనిలోవిచ్ (సెర్బియా) చేతిలో పరాజయం పాలైంది. అర్నాల్ది (ఇటలీ), కోర్దా (అమెరికా), గ్రీకోస్పూర్ (నెదర్లాండ్స్) కూడా రెండో రౌండ్‌ను అధిగమించారు.