#Sport News

RCB vs LSG: బుల్లెట్ వేగం ఓవైపు.. మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు..

Bengaluru Weather Report, RCB vs LSG: తన ఐపీఎల్ అరంగేట్రంలో 155.8 కిమీ వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్, ఇన్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నేడు ఒకరినొకరు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య పోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందా, మంచు ప్రభావం ఎలా ఉందో ఓసారి చూద్దాం..

Mayank Yadav vs Virat Kohli, RCB vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 15వ మ్యాచ్ ఈరోజు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (RCB vs LSG) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో లక్నో RCBతో తలపడుతుండగా, అందరి దృష్టి ఢిల్లీ యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్‌పై ఉంది. గత మ్యాచ్‌లో మయాంక్ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ అరంగేట్రంలో మయాంక్ గంటకు 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు.

ఈసారి మయాంక్‌ను ‘విరాట్’ ఎదుర్కోనున్నాడు. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో తలపడేందుకు ఈ యువ బౌలర్ ఎదురుచూస్తున్నాడు. ఇలా మయాంక్-కోహ్లీ మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. మరి కీలక మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్స్ ఎలా రాణిస్తారో చూడాలి. సొంతమైదానంలో గత మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

RCB ఇప్పటి వరకు తమ ప్రదర్శనల్లో నిలకడగా లేదు. మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వారి నెట్ రన్ రేట్ కూడా అధ్వాన్నంగా మారింది. ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని RCB జట్టును విస్మరించలేం. కానీ, ఆటగాళ్లు వారి ప్రదర్శనలో స్థిరంగా ఉండాలి. వారికి చాలా మంది స్టార్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. కానీ, విరాట్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *