#Sport News

IPL 2024: ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్.. ఏప్రిల్ 7లోపు కీలక ప్రకటన: టీమిండియా మాజీ క్రికెటర్..

IPL 2024, Hardik Pandya: రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల ఓటమితో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి షోలో పాల్గొన్న మనోజ్ తివారీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే హార్దిక్ పాండ్యా రాజస్థాన్‌పై ముంబైకి బౌలింగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు.

IPL 2024, Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2024 సీజన్ ఇప్పటివరకు చాలా చెత్తగా మారింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఒకటి రెండు కాదు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసింది. దీని తర్వాత, ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించాలని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఓ కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మారబోతున్నాడంటూ చెప్పుకొచ్చాడు.

మనోజ్ తివారీ ఏం చెప్పారు?

రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల ఓటమితో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి షోలో పాల్గొన్న మనోజ్ తివారీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే హార్దిక్ పాండ్యా రాజస్థాన్‌పై ముంబైకి బౌలింగ్ చేయలేదు. అయితే, అంతకుముందు మ్యాచ్‌లలో అతను బంతిని ప్రారంభంలోనే తీసుకున్నాడు. ఆ సమయంలో అతడు బౌలింగ్ చేసి ఉండాల్సింది. కానీ ఒత్తిడి కారణంగా ఆ పని చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మనోవ్ తివారీ మాట్లాడుతూ..

వచ్చే ఆదివారం వరకు ముంబై ఇండియన్స్‌కు మరో మ్యాచ్ లేదు. ఈ విరామ సమయంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పెద్ద నిర్ణయం తీసుకుని రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా చేయగలదని నా భావన. ఎందుకంటే, నేను ఫ్రాంచైజీ క్రికెట్‌ను లేదా వాటి యజమానులను అర్థం చేసుకున్నంత వరకు, వారు నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడరు. ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. హార్దిక్ చాలా సింపుల్ కెప్టెన్సీని అందించాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. హైదరాబాద్ చాలా పరుగులు చేస్తున్న సమయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. ఇది కాకుండా 13వ ఓవర్‌లో జట్టు బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తీసుకొచ్చినప్పుడు హార్దిక్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అందువల్ల, ఇది కీలక మార్పునకు సంకేతంలా అనిపిస్తుంది’అంటూ చెప్పుకొచ్చాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *