IPL 2024 GT VS PBKS: శుభ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్.. సీజన్ టాప్ స్కోర్

పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ అయ్యాక తొలి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్ ఓటమిపాలైనప్పటికీ గిల్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ చూడచక్కటి షాట్లు ఆడాడు. గిల్ కొట్టిన సిక్సర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గిల్ సునాయాసంగా బంతులను బౌండరీ లైన్ పైకి తరలించాడు. ఐపీఎల్‌లో గిల్ బ్యాట్ నుంచి జాలువారిన క్లాసీ ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (35) రెచ్చిపోవడంతో పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.