Asian Badminton Championships Sindhu : సింధు పరాజయం…

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్ల కథ ముగిసింది. గురువారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో సింధు 18-21, 21-13, 17-21తో ఆరో సీడ్ హన్ యు (చైనా) చేతిలో పరాజయం…
- సింధు, ప్రణయ్ కూడా ఇంటిదారి
- ఆసియా చాంపియన్‌షిప్స్

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్ల కథ ముగిసింది. గురువారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లో సింధు 18-21, 21-13, 17-21తో ఆరో సీడ్ హన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. గతంలో హన్ యుపై 5-0తో మెరుగైన రికార్డు కలిగిన సింధు అలవోకగా నెగ్గుతుందని భావించారు. కానీ, గంటకుపైగా సాగిన పోరులో చైనా షట్లర్.. తొలిసారి సింధుపై పైచేయి సాధించింది. ఇక రెండో రౌండ్లో ప్రణయ్ 18-21, 11-21తో చిన్ చున్‌యి (చైనీస్ తైపీ) చేతిలో వరుస గేముల్లో చిత్తయ్యాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 17-21, 12-21తో మట్సుయామ-చిహారు (జపాన్) చేతిలో ఓటమి చవిచూసింది.