Fighter Movie OTT: Where is the streaming? రెండు నెలల్లోపే వస్తోన్న ఫైటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్.  ఫైటర్ […]

Keerthy Suresh’s new movie with Suhas.. సుహాస్‌తో కీర్తి సురేశ్‌ కొత్త మూవీ.. టైటిల్‌ ఏంటో తెలుసా?

హీరోయిన్‌ ‌కీర్తి సురేశ్‌ మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ సుహాస్‌ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వసంత్‌ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా […]

Rakul Preet Singh: Married.. Are you wearing formal clothes? పెళ్లయిపోయింది.. మరి పద్ధతైన దుస్తులు వేసుకుంటున్నారా?

చాలామంది అమ్మాయిలు పెళ్లంటేనే భయపెడతారు. ఎందుకు? పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, అనేక కట్టుబాట్లు ఉంటాయని, తమ జీవితం అవతలివారి చేతుల్లోకి వెళ్లిపోతుందని! పెళ్లికి ముందు, తర్వాత.. జీవితం ఒకేలా ఉండదన్నదే వారి ప్రధాన భయం! అయితే ఇది కేవలం అపోహే అని కొట్టిపాడేయలేం.. పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా, జాలీగా తమకు నచ్చినట్లు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అవతలివారికి నచ్చినట్లు మెదులుకునేవారూ ఉన్నారు. పెళ్లిని ఎందుకని..ఇప్పుడిదంతా ఎందుకంటే? ఈ మధ్యే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన […]

ED : There is no violation of rules in Kavitha’s arrest కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు

దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ కొట్టేశారు. ఆమె […]

Ponnam : Complained to CS about RDO recording phone call ఫోన్‌కాల్‌ రికార్డు చేసిన ఆర్డీవోపై సీఎస్‌కు ఫిర్యాదు చేశా: పొన్నం

తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే: తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్డీవోపై సీఎస్‌ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. […]

I am a junior in Congress.. How can I become CM: Ponguleti కాంగ్రెస్‌లో జూనియర్‌ని.. నేనెలా సీఎం అవుతా: పొంగులేటి

హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీలో నేను చాలా జూనియర్‌ని.. తాను ఎలా ముఖ్యమంత్రిని అవుతానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు వార్తలు రాసుకుంటున్నారని అన్నారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి అవుతానని నేను అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. తెలంగాణలో 11కు పైగా ఎంపీ సీట్లు ఈజీగా గెలుస్తాం. 3 సీట్లలో పోటాపోటీ ఉంటుంది. బీజేపీ 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ 1 లేదా రెండు ఎంపీ సీట్లు గెలిచే […]

ANDHRA BJP : tickets.. Confusion in AP BJP టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం

సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన‌ కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం‌ కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని […]

Congress party What about the Lok Sabha elections? భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనం.. మరీ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితేంటి..?

భాగ్యనగరంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఘనంగానే ఉన్నా… భవిష్యత్‌లో మళ్లీ పుంజుకుంటారా ? లేదా ? అన్నదీ ఆసక్తి రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టుమని మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు చక్రం తిప్పేశారు. భాగ్యనగరంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య లాంటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. కొండా […]

ANDHRA POLITICAL : Pawan Kalyan met with Chandrababu చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు.  ఇప్పటికే తెదేపా 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 16 పెండింగులో ఉన్నాయి. 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పెండింగులో ఉన్న శాసనసభ […]

SPs Palnadu, Prakasam and Nandyala were present before the CEO సీఈవో ఎదుట హాజరైన పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలు

ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు గురువారం సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. అమరావతి: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. దీంతో ముగ్గురు ఎస్పీలు గురువాం సీఈవో మీనా […]