BJP MLA Rajasingh House Arrest బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. […]