T20 WC: భార‌త్‌-పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు.. టీమిండియాకు మూడెంచెల భ‌ద్ర‌త!

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు మ‌రో రెండు రోజుల్లో తెర‌లేవ‌నుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లు వేదిక‌గా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు అమెరికా, క‌రేబియ‌న్ దీవుల‌కు చేరుకున్నాయి. ఇక టీమిండియా విష‌యానికి వ‌స్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో త‌మ వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నుంది. అనంత‌రం జూన్ 9న న్యూయార్క్ వేదిక‌గా చిరకాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో భార‌త్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ […]

Pushpa 2 Sooseki Song Lyrical Video: ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్‌ విడుదలై సూపర్‌ డూపర్‌ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ అయింది.  ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం […]

Nivetha Pethuraj: పోలీసులతో గొడవపడ్డ నివేదా పేతురాజ్‌.. వైరలవుతోన్న వీడియో

పోలీసులతో నివేదా పేతురాజ్‌ గొడవ పడుతోన్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.  ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులతో ఆమె గొడవపడుతున్నట్లు ఉన్న ఆ వీడియో చూసినవారంతా తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే.. కారులో ప్రయాణిస్తోన్న నివేదను పోలీసులు ఆపి డిక్కీ ఓపెన్‌ చేయాలని కోరారు. దీనికి ఆమె అంగీకరించకపోగా కోపంగా మాట్లాడారు. ‘రోడ్డు వరకు వెళ్తున్నాను. […]

Kalki: అందుకే ‘కల్కి’ బడ్జెట్‌ ఎక్కువ: ప్రభాస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ . ఈ చిత్రం జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ప్రభాస్‌ , నాగ్‌ అశ్విన్‌లు ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘‘కల్కి’ గ్లోబల్‌ రేంజ్‌లో ఉండనుంది. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని […]

AP Elections 2024: ఏపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. రాత్రి 8-9 గంటల మధ్య తుది ఫలితాలు

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. డిజిటల్, అమరావతి: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని, జూన్‌ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో […]

Chandrababu Comments About YSRCP:కౌంటింగ్‌ రోజున కూడా YSRCP పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం

ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్‌ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో చెప్పారు. డిజిటల్, అమరావతి: ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న వైకాపా మూకలు.. కౌంటింగ్‌ రోజున కూడా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తనకు సమాచారం అందిందని తెదేపా అధినేత చంద్రబాబు తమ పార్టీ నేతలతో […]

Phone Tapping Case: 1,200 ఫోన్లు ట్యాప్‌ చేశాం

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబరు 4న రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు ఎస్‌ఐబీలోని కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో కట్‌ చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు, సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్‌బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార […]

Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. హైదరాబాద్‌: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ […]

Suicide by jumping into the engine of the plane..?  ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా..?

ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తిని విమానం ఇంజిన్‌ లోపలికి లాగేసుకొంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? […]