IPL 2024: Csk VS Sunrisers : HYDERABD సీఎస్‌కేతో తలపడనున్న సన్‌రైజర్స్‌

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 5) బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం చూసేందుకు అభిమానులు ఆరాటపడిపోతున్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్‌ విన్యాసాలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ట్రవిస్‌ హెడ్‌, అబిషేక్‌ శర్మ, […]

IPL 2024 GT VS PBKS:  శుభ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌.. సీజన్‌ టాప్‌ స్కోర్‌

పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ అయ్యాక తొలి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్‌ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైనప్పటికీ గిల్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో […]

Ajith hero who proved that : ధైర్యానికి హద్దులుండవని నిరూపించిన హీరో

యాక్షన్‌ సినిమాలంటేనే ఎంతో రిస్క్‌తో కూడుకున్నవి. ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాల్లో డూప్‌ లేకుండా స్వయంగా హీరోలే బరిలోకి దిగడం చాలా అరుదు. కానీ.. తమిళ కథానాయకుడు అజిత్‌ దీనికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి. సినీప్రియుల్ని మెప్పించడానికి ఎంతటి సాహసాలకైనా వెనకాడరు. స్టంట్స్‌ చేయడంపై ఎప్పుడూ ఆసక్తి చూపించే అజిత్‌.. పలు చిత్రాల్లో డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ప్రమాదాలకు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ‘విదా ముయార్చి’ కోసం మరోసారి అలాంటి సాహసాలనే చేశారాయన. ఈ […]

Rajinikanth: Upcoming Movie రజినీకాంత్ కొత్త సినిమా పేరు ఏంటి ?

కథానాయకుడు రజనీకాంత్‌ – దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 22న ప్రకటించనున్నట్లు నిర్మాతలు ఇటీవల వెల్లడించారు. కాగా, ఇప్పుడా పేరుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం ‘కళుగు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనికి తెలుగులో డేగ అని అర్థం. రజనీ పాత్ర తీరు తెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర […]

BJP Andhra Pradesh : భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పని చేస్తా

ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. శుక్రవారం భాజపా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇటీవల ఎమ్మిగనూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి […]

Janasena TDP Quota: జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌!

జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట పవన్‌ కల్యాణ్. అవనిగడ్డ, భీమవరంలో ఇదే ఫార్ములా అనుసరించిన ఆయన, రేపు పాలకొండలోనూ టీడీపీ నుంచి వచ్చిన వారికే టికెట్‌ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. జనసేనలో తెలుగుదేశం పార్టీ కోటా. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే జరుగుతోంది. టీడీపీతో అంతర్యుద్ధం ఉన్న చోట జనసేన కోటాలో టీడీపీ వారికే టికెట్‌ ఇస్తున్నారట […]

YS. Sharmila Congress Party Andhra : హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే కడప నుంచి పోటీ: షర్మిల

ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. కాశినాయన: ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైకాపా టికెట్‌ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు. […]

Election Commission notices to Nara Chandrababu Naidu : చంద్రబాబు కు నోటీసులు జారీ చేసిన ఎలక్షన్ కమిషన్

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో టీడీపీ కంప్లైంట్‌తో మంత్రి జోగి రమేశ్‌, వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు ఇచ్చారు సీఈవో ముకేష్ కుమార్ మీనా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల […]

Minister Konda Surekha : will respond promptly to notices : కేటీఆర్‌ నోటీసులకు దీటుగా బదులిస్తా..: మంత్రి కొండా సురేఖ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనకు పంపిన లీగల్‌ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనకు పంపిన లీగల్‌ నోటీసులకు దీటుగా సమాధానమిస్తానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తుక్కుగూడ సభా ప్రాంగణం వద్ద గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను కేటీఆర్‌ పరువుకు భంగం కలిగేలా మాట్లాడానంటూ ఆయన నోటీసులిచ్చారని పేర్కొన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని ఆయన అందులో డిమాండ్‌ చేశారని.. తాను […]

Deputy Chief Minister Bhatti : వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?: ఉప ముఖ్యమంత్రి భట్టి

రంగారెడ్డి జిల్లా: ‘‘తీవ్రవాదుల గుర్తింపు, దేశ భద్రత కోసం ఏర్పాటు చేసి న చట్టాలను నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టింది. ఇది ఎంత వరకు కరెక్ట్‌? ప్రతిపక్షాలు, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. భార్యాభర్తలు, వ్యాపారులు, అధికారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్‌ చేశారు. ఇంతా చేసి తీరా ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం అని తప్పించుకుంటారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఎవరూ క్షమించరు’’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్‌ఎస్‌ […]