Apple iPhone 15 ఈవెంట్ ముఖ్యాంశాలు: iPhone 15 సిరీస్ గేట్స్ USB-C మరియు టైటానియం ఫ్రేమ్, వాచ్ 9 హాసా మెరుగైన చిప్

Iphone launch: Apple అధికారికంగా iPhone 15, iPhone 15 Pro మరియు Apple Watch Series 9లను ఆవిష్కరించింది. కంపెనీ కొత్త Apple Watch Ultra 2 మోడల్‌ను కూడా ప్రదర్శించింది. ఈ సంవత్సరం, అన్ని కొత్త Apple పరికరాలు గణనీయమైన అప్‌గ్రేడ్‌లను పొందాయి, అయితే అదృష్టవశాత్తూ సంభావ్య కస్టమర్‌ల కోసం, ధరలు స్వల్పంగా పెరిగాయి. 15 ప్రో మాక్స్ మోడల్ ధర ఇప్పుడు రూ. 1,59,900, భారతదేశంలో రూ. 5,000 పెరిగింది, చాలా ఎక్కువ […]

This is the story of plants.. – ఇదండీ మొక్కల కథ..

రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆకుపచ్చ తెలంగాణ(Telangana) లక్ష్యంగా హరితహారం(Harithaharam) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018లో వచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు కేటాయించే బడ్జెట్‌ల్లో 10 శాతం నిధులు పచ్చదనానికి వెచ్చించాల్సి ఉంది. ప్రతి గ్రామం, పురపాలక సంఘం పరిధిలో తప్పనిసరిగా నర్సరీ ఉండాలనేది నిబంధన. అంతటి ప్రాధాన్యం కలిగిన మొక్కల పెంపకానికి నేతలు, అధికారులు అనుకున్నంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఈ ఏడాది వానాకాలంలో ఆదిలాబాద్‌కు 45.09 లక్షలు, కుమురంభీంకు 53.03 […]

Minister KTR responded -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

Heavy rains – హైదరాబాద్‌లో భారీ వర్షం

రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు(Heavy Rain) కురిశాయి. శనివారం ప్రారంభమైన వర్షం ఆదివారం ఆగలేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడ్డాయి. ఈ వర్షాలు క్రమం తప్పకుండా కురుస్తున్నాయని వాతావరణ శాఖ(Department of Meteorology) చెబుతోంది. గోపాల్‌పేటలో 7.2 సెంటీమీటర్లు, చందంపేటలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌తో పాటు సమీపంలోని మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా […]

On 17th they should flock to Vijayabheri like a fair – 17న విజయభేరికి జాతరలా తరలి రావాలి

ఖమ్మం: హైదరాబాద్‌ వేదికగా తొలిసారి ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలు చరిత్రాత్మకం కానున్నాయని, చివరి రోజు రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో జరిగే విజయభేరి సభకు ప్రజలు జాతరలా తరలిరావాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సభను విజయవంతం చేయడానికి నేతలు, కేడర్‌ ప్రజాక్షేత్రంలోకి కదలి వెళ్లాలని సూచించారు. సభలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు డిక్లరేషన్లు పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటిస్తారని, ఇవి […]

Electricity – దేశంలో కరెంటు విక్రయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

దేశంలో విద్యుత్ ధరలు చాలా ఖరీదైనవి. తెలంగాణలో కోతల్లేకుండా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. గత నెల 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులో నిర్ణీత సమయాల్లో యూనిట్‌కు గరిష్టంగా 10 రూపాయల ధర నిర్ణయించినప్పటికీ తెలంగాణలోని విద్యుత్ సంస్థలు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్  అనే ప్రదేశం నుండి విద్యుత్ కొనుగోలు చేశాయి. మొత్తంగా, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలు ఆగస్టు 2023లో 886.50 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే, ఈ ఏడాది అమ్మకాలు 21 శాతం పెరిగాయని ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ తెలిపింది. అలాగే ఆగస్టులో దేశంలో విద్యుత్ సగటు ధర యూనిట్‌కు 6.89 రూపాయలుగా ఉందని, ఇది గత ఏడాది కంటే 33 శాతం ఎక్కువని చెప్పారు. […]

Congress – డిష్యూం.. గొడవలు ??!!!

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా కాంగ్రెస్‌లో రోజు రోజుకు గ్రూపు తగాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 17న హైదరాబాద్‌లో జరగనున్న విజయ భేరి సభను జయప్రదం చేసేందుకు ఖమ్మంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మహ్మద్‌ ఆరిఫ్‌ నసీంఖాన్, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి తదితరులు పాల్గొనగా, ఖమ్మం టికెట్‌ బీసీలకు కేటాయించాలని పుచ్చకాయల వీరభద్రం కోరారు. […]

Power generating stations- నేరుగా విద్యుత్తును విక్రయించవచ్చు

పెరుగుతున్న డిమాండును దృష్టిలో పెట్టుకుని కరెంటు కొరత ఉన్న రాష్ట్రాలకు కేంద్రం కొత్త అవకాశమిచ్చింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లో పేర్కొన్న గడువు తేదీ ముగిసిన తరవాత విద్యుదుత్పత్తి కేంద్రాలు(జెన్‌కో) కరెంటును నేరుగా అమ్ముకోవచ్చు. ఇందుకు అవకాశమిస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గడువు ముగిసినా… పాత ఒప్పందంలో కరెంటు కొన్న డిస్కంలు అడిగితే తిరిగి విక్రయించాలని గత మార్చిలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. గడువు ముగిసినా ఆ డిస్కంలకు […]

Anganwadis – డిమాండ్లను నెరవేర్చాం

దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్‌వాడీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను తాము నెరవేర్చామన్నారు. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌లో మంగళవారం అంగన్‌వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీలను కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసిన జీవో, […]

Don’t forget the decency.. don’t ignore the elders – మమకారం మరువకు.. పెద్దలను విస్మరించకు

తొమ్మిది నెలలు మోసి కని పెద్ద చేసిన తల్లి.. బాధ్యతగా చదివించి సద్భుద్ధులు నేర్పి ప్రయోజకున్ని చేసిన తండ్రిని పిల్లలు దూరం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే భారం దింపుకొనేలా వ్యవహరిస్తుండటంతో చెప్పుకోలేని క్షోభ అనుభవిస్తున్నారు. చట్ట పరిధిలో వారికుండే రక్షణ, తదితర విషయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం. వద్ధాప్యంలో కన్నవారిని కంటికి రెప్పలా చేసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే. వారిని చీదరించుకోవడం.. సూటిపోటి మాటలతో వారి మనసు నొప్పించడమే కాకుండా […]