G20 summit 2023: జీ20లో ఆఫ్రికా యూనియన్‌ చేరిక దాదాపు ఖాయం..

భారత్‌ (India) అధ్యక్షతన జీ20 (g20 summit 2023) విస్తరణ దాదాపు ఖాయమైంది. తాజా దిల్లీ శివార్లలోని ఓ రిసార్టులో జీ20 షెర్పాల సమావేశంలో ఆఫ్రికా యూనియన్‌కు సభ్యత్వం ఇవ్వడానికి ఓ అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆఫ్రికా యూనియన్‌ చేరిక తర్వాత జీ20 గ్రూపు పేరును జీ21గా మారుస్తారా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. తాజాగా దీనిపై ప్రకటన వెలువడితే మాత్రం జీ20లో పేద దేశాల ప్రాతినిధ్యం ఇచ్చినట్లవుతుంది. భారత్‌ అధ్యక్షతన ఈ గ్రూపుపై […]

Electricity Rates are Skyrocketing – దేశంలో కరెంటు విక్రయ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి

దేశంలో విద్యుత్ ధరలు చాలా ఖరీదైనవి. తెలంగాణలో కోతల్లేకుండా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేందుకు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. గత నెల 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులో నిర్ణీత సమయాల్లో యూనిట్‌కు గరిష్టంగా 10 రూపాయల ధర నిర్ణయించినప్పటికీ తెలంగాణలోని విద్యుత్ సంస్థలు ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్  అనే ప్రదేశం నుండి విద్యుత్ కొనుగోలు చేశాయి. మొత్తంగా, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థలు ఆగస్టు 2023లో 886.50 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే, ఈ ఏడాది అమ్మకాలు 21 శాతం పెరిగాయని ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ తెలిపింది. అలాగే ఆగస్టులో దేశంలో విద్యుత్ సగటు ధర యూనిట్‌కు 6.89 రూపాయలుగా ఉందని, ఇది గత ఏడాది కంటే 33 శాతం ఎక్కువని చెప్పారు. […]

Telangana Haritaharam – తెలంగాణ హరితహారం

తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అడవులను కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించాలంటూ ఆయన ఇటీవల ఓ సందేశాన్ని విడుదల చేశారు. అడవులు, పచ్చదనం మన సమాజానికి ఎంతో అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో చెట్ల పెంపకం, పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రయత్నానికి చాలా మంది నుంచి మద్దతు లభించింది. నిజానికి భవనాలు అధికంగా ఉన్న హైదరాబాద్ నగరంలో కూడా పచ్చదనం […]

We have fulfilled the demands of Anganwadis – అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చాం

దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్‌వాడీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టంచేశారు. ప్రస్తుతం వారు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న డిమాండ్లతో సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను తాము నెరవేర్చామన్నారు. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్‌లో మంగళవారం అంగన్‌వాడీ టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీలను కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేసిన జీవో, […]

Don’t forget the decency.. don’t ignore the elders – మమకారం మరువకు.. పెద్దలను విస్మరించకు

తొమ్మిది నెలలు మోసి కని పెద్ద చేసిన తల్లి.. బాధ్యతగా చదివించి సద్భుద్ధులు నేర్పి ప్రయోజకున్ని చేసిన తండ్రిని పిల్లలు దూరం చేసుకుంటున్న సంఘటనలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వృద్ధాప్యంలో అండగా ఉంటారనుకుంటే భారం దింపుకొనేలా వ్యవహరిస్తుండటంతో చెప్పుకోలేని క్షోభ అనుభవిస్తున్నారు. చట్ట పరిధిలో వారికుండే రక్షణ, తదితర విషయాలపై ‘న్యూస్‌టుడే’ కథనం. వద్ధాప్యంలో కన్నవారిని కంటికి రెప్పలా చేసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులదే. వారిని చీదరించుకోవడం.. సూటిపోటి మాటలతో వారి మనసు నొప్పించడమే కాకుండా […]

Protect trees – మట్టి మేలు తలపెట్టవోయ్‌!

మనం చేసుకునే ప్రతి పండగ ప్రకృతితో మమేకమై ఉంటుంది.. చెట్లను కాపాడుకోవడం, చెరువులను రక్షించడం అందులోని ప్రత్యేకత. ఆధునికత ముసుగులో రానురానూ పండగ స్ఫూర్తి లోపిస్తోంది. పైపై హంగులు పెరిగి ప్రకృతికి విఘాతం కలుగుతోంది. ఏటా వినాయక చవితికి విగ్రహాలు అందంగా, వర్ణయుతంగా ఉండాలన్న ఉద్దేశంతో పోటీపడి ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా పర్యావరణం కాలుష్యమై మనతోపాటు చాలా జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రంగురంగుల రసాయనాలతో చేసిన విగ్రహాలనే ఎక్కువగా ఏర్పాటు చేస్తుంటారు. భవిషత్తులో […]

She team, awareness conference on cyber crime – షీటీం, సైబర్‌ నేరాలపై అవగాహన సదస్సు

మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నాయని, ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ రామేశ్వర్‌ అన్నారు. మంగళవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో షీటీం, డయల్‌ 100, సైబర్‌ నేరాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. వ్యసనాలకు బానిసలైతే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఫోన్ల వినియోగం పెరగటంతో సైబర్‌ నేరాలు అధికమయ్యాయని, వాటిపై […]

Babu Arrested.. Junior NTR Taking Light.. RGV’s Tweet Goes Viral – బాబు అరెస్ట్‌.. లైట్‌ తీసుకుంటున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

పాపం పండింది.. పాపాల చిట్టా బయటపడింది. చేసిన పనికి ఫలితం అనుభవించాల్సిందే! అది మంచైనా, చెడైనా! చంద్రబాబు అమానుష పాలనలో అవినీతి కథలు కోకొల్లలు. అయితే దేన్నైనా మసిపూసి మారేడు కాయ చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆ అవినీతి కథలను బయటకు రానివ్వలేదు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం పండిన నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే! […]

Bigg Boss 7: హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌!

ఏ ఒక్కరూ ఇష్టపడని వైనంసోమవారం జరిగిన నామినేషన్స్‌ ఎపిసోడ్‌లో శివాజీని అత్యధికంగా ఐదుగురురు నామినేట్‌ చేశారు. ముందుగా అమర్‌ దీప్‌..శివాజీని నామినేట్‌ చేస్తూ ఇచ్చి పడేశాడు.  ‘ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడు.. వాడికి ఫోకస్ ఉంది.. వాడు మగాడంటే.. మరి నేను ఆటాడటానికి కాకుండా పేకడటానికి వచ్చానా అన్నా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్‌ కూడా శివాజీని నామినేట్‌ చేస్తూ.. ‘ఎదుటి వాళ్లని మాట్లాడనీయకుండా దబాయిస్తున్నారు’ అని చెప్పింది. దీంతో దీంతో శివాజీ.. ‘నేను […]

NASA Mercury Latest Image: ఆకాశంలో వజ్రం.. ‘లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై’

వాషింగ్టన్ (Washington): సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహమైన బుధుడి ఫోటోను తీసింది నాసాకు చెందిన వ్యోమనౌక ‘మెసెంజర్’.  నాసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ ఫోటోను చూస్తే చిన్నప్పుడు చదువుకున్న ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై’ పదాలు గుర్తుకు రాక మానవు. అచ్చంగా వజ్రాన్ని పోలి ఉన్న బుధుడు ఆకాశంలో వెలుగుజిలుగులతో నిజంగానే డైమండ్‌లా మెరిసిపోతున్నాడు.   ‘మెసెంజర్’ ‘అడ్వెంచర్’ఈ గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమనౌక […]