Libya : A Monster Wave Of About 23 Feet Hit The Town – లిబియా: సుమారు 23 అడుగుల అల పట్టణాన్ని తాకింది 

లిబియా (Libya)లోని డేర్నా(Derna)లో కేవలం ఒక్కే ఒక్క రాకాసి అల దాదాపు 20,000 మంది ప్రాణాలను తీసిందని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ (ఐసీఆర్‌సీ) నిపుణులు చెబుతున్నారు. ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని పేర్కొన్నారు. మరికొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొంది. అత్యంత వేగంతో దూసుకొచ్చిన బురద నీరు.. పెద్ద పెద్ద భవనాలను కుప్పకూల్చి ప్రజలను ఈడ్చుకొని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటన […]

Rishi Sunak’s wife’s shares have caused controversy – రిషి సునక్ భార్య షేర్లు వివాదానికి కారణమయ్యాయి

ఓ బాలల సంరక్షణాలయంలో బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ సతీమణి అక్షతా మూర్తి పెట్టుబడుల గురించి తలెత్తిన వివాదంలో సునాక్‌ సిబ్బంది వ్యవహరించిన తీరును పార్లమెంటు ప్రమాణాల సంఘం ఆక్షేపించింది. బాలల సంరక్షణ బాధ్యత తీసుకునేవారికి 600 పౌండ్ల చొప్పున నగదు ప్రోత్సాహకం ఇవ్వడానికి బ్రిటన్‌ ప్రభుత్వం వసంతకాల బడ్జెట్‌లో ఓ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఏదైనా సంస్థ ద్వారా చేరే సంరక్షకులకు 1,200 పౌండ్లను చెల్లించడానికి ఈ కార్యక్రమంలో వెసులుబాటు ఉంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పేర్కొన్న […]

Another Drug Stain On Tollywood – టాలీవుడ్‌ తెరపై మరో డ్రగ్‌ మరక…

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (టీఎస్‌–నాబ్‌) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్‌ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉండగా… గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ […]

Congress Party Will Win More Than 70 Assembly Seats – ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా….

హైదరాబాద్‌: ‘ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది’అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురు వారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నల్ల గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈ నెల 17న రాష్ట్ర చరిత్రలో నే అరుదైన బహిరంగసభను […]

Two strange shapes believed to be alien corpses… – ఏలియన్ శవాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలు…

మెక్సికో పార్లమెంటు (కాంగ్రెస్‌) సమావేశాల్లో తాజాగా అరుదైన పరిణామం చోటుచేసుకుంది. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా(Alien corpses) భావిస్తున్న రెండు వింత ఆకారాలను మంగళవారం కొందరు పరిశోధకులు నేరుగా పార్లమెంటుకు తీసుకొచ్చారు. చట్టసభ్యుల ముందు వాటిని ప్రదర్శించి.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను వారికి నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ వాంగ్మూలాలను అందజేసినవారిలో మెక్సికోతో పాటు అమెరికా, జపాన్‌, బ్రెజిల్‌ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు సూచించడం గమనార్హం. పెరూలోని నజ్కా […]

Manipur Violence-ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది….

జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపుర్‌(Manipur)లో ఇంకా పూర్తిగా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. 33 మంది అదృశ్యమయ్యారని, 1,118 మంది గాయపడ్డారని తెలిపింది. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. (Manipur Violence)  మే 3న తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ మొదలైంది. […]

Death of a Telugu student studying in America – అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థి మృతి

అమెరికా (USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి (Jaahnavi Kandula) మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్‌.. ఆ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరింది. ఇదిలా ఉండగా.. పోలీసు అధికారి వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీ (degree posthumously) ఇవ్వాలని ఆమె చదివిన నార్త్‌ఈస్ట్రన్‌ యూనివర్సిటీ నిర్ణయించింది. జాహ్నవి మృతిపై యూనివర్సిటీ […]

Thugs Took A Six-Month-Old Child – ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు…..నిలోఫర్‌ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి ఫైజల్‌ ఖాన్‌ను ఎత్తుకెళ్లారు. ఆస్పత్రిలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తప్పి పోయిన బాలుడి తల్లి భోజనం కోసం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనపై బాధితురాలు నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, బాలుడు ఫైజల్‌ […]

Elon Musk: ఆ దాడికి స్టార్‌లింక్‌ సేవలు ఇవ్వం.. మస్క్‌ నిర్ణయం..!

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌(Ukraine)కు స్పేస్‌ఎక్స్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) షాకిచ్చారు. తమకు అత్యవసరంగా  స్టార్‌ లింక్‌ సేవలను అందించాలని ఉక్రెయిన్‌ చేసిన విజ్ఞప్తిని శుక్రవారం ఆయన తిరస్కరించారు. ఈ విజ్ఞప్తిని ఆమోదిస్తే యుద్ధానికి పెద్ద కవ్వింపు చర్యగా మారుతుందని.. అప్పుడు సంక్షోభం మరింత తీవ్రమవుతుందని వివరించారు.  ఒక ఎక్స్‌ (ట్విటర్‌) వినియోగదారుడు చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఉక్రెయిన్‌ కీలక ఎదురుదాడి చేస్తున్న సమయంలో స్టార్‌ లింక్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ […]

Kim Jong Un: న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌ తయారీ .. ప్రపంచానికి షాకిచ్చిన ఉత్తరకొరియా!

కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) నేతృత్వంలోని ఉత్తరకొరియా (North Korea) అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదు. ఏకంగా ‘టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌మెరైన్‌’ను తయారు చేసినట్లు నేడు ప్రకటించింది. రెండు రోజుల క్రితం ప్యాంగ్యాంగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిమ్‌ స్వయంగా పాల్గొన్నారు. ఓ షిప్‌ యార్డ్‌లో సబ్‌మెరైన్‌ను పరిశీలిస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని ఉ.కొరియా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇది సోవియట్‌ కాలం నాటి రోమియో శ్రేణి […]