“Fire Safety & Fire Prevention Campaign 2023” – “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023”

రిలయన్స్ జియోతన నెట్వర్క్ సైట్‌లు, సౌకర్యాల భద్రతకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంలో తెలంగాణలో “ఫైర్ సేఫ్టీ & ఫైర్ ప్రివెన్షన్ క్యాంపెయిన్ 2023″ని ప్రారంభించింది. “ఫైర్ ప్రివెన్షన్ – మస్ట్ ఫర్ నెట్‌వర్క్ అవైలబిలిటి అండ్ సర్వీస్ తో కస్టమర్” అనే థీమ్ తో ఈ సమగ్ర ప్రచారాన్ని జియో తెలంగాణ ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 15, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ నిర్వహణ పాయింట్లు, జియో సెంటర్‌ ప్రాంతాలు, అన్ని నెట్‌వర్క్‌ సైట్ లను కవర్ […]

Good news for TS RTC employees.. – టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ఆర్టీసీ(TS RTC) కార్మికులకు శుభవార్త. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ (Governor)ఆమోద ముద్ర వేశారు. అయితే మొదట టీఎస్‌ఆర్టీసీ విలీన బిల్లు 2023ను మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం నెల రోజుల క్రితమే పంపింది. విలీన బిల్లులోని అంశాలను పరిశీలన కోసం పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈరోజు ఆమోదం తెలిపారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై ప్రభుత్వం గవర్నర్‌కు వివరణ […]

Two more days of heavy rains in Telangana..says weather reports – తెలంగాణలో మరో రెండురోజులు మోస్తరు వర్షాలు..!

తెలంగాణ: తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. అయితే, గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. శుక్రవారం […]

Kalvakuntla firey comments on ED Notices – ఈడి నోటీసు లు గురించి విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

 నిజామాబాద్: రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని.. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ నోటీసుల పరిణామంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. నోటీసులు అందించిన విషయాన్ని ఇవాళ నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ధృవీకరించారామె. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై సెటైర్లు సంధించారు. నోటీసులు అందాయి. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ముందు నుంచి చెబుతున్నాం. మళ్లీ రాజకీయం కోసమే పంపారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు. తెలంగాణలో నెలకొన్ని రాజకీయ వాతావరణం, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రజలు […]

Another drug stain on Tollywood – టాలీవుడ్‌ తెరపై మరో డ్రగ్‌ మరక…

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (టీఎస్‌–నాబ్‌) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్‌ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉండగా… గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ […]

Cultivation of crops during the monsoon season in Telangana exceeded the normal target – తెలంగాణలో వానాకాలం సీజన్‌లో సాధారణ లక్ష్యాన్ని మించి పంటల సాగు జరిగింది

తెలంగాణలో వానాకాలం సీజన్‌లో పంటల సాగు సాధారణ లక్ష్యాన్ని అధిగమించింది. 1,24,28,723 ఎకరాలకు గాను బుధవారం వరకు 1,25,05,641 (100.62) ఎకరాల్లో రైతులు పంటలు వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. నిరుడు సాగైన 1,31,22,539 ఎకరాలతో పోల్చుకుంటే ఈసారి దాదాపు ఆరు లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గిందని తెలిపింది. వరి సాగు 49,86,634 ఎకరాల సగటుకు గాను 63,55,986 ఎకరాల (127.46 శాతం)లో నాట్లు పడ్డాయి.  పత్తి 50,59,225 ఎకరాల లక్ష్యానికి గాను 45,00,475 […]

54 tenders for purchase of grain – మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా….

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్‌ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్‌ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్‌ఎంటీ ఒక లాట్‌గా ఆన్‌లైన్‌లో బిడ్స్‌ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్‌ బిడ్లు […]

Dengue and toxic fevers are rampant in the Godavari basin – డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి….

వరంగల్‌: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి […]

King Sirisilla- యువ‌కుడు దారుణ హ‌త్య‌

(Rajanna Siricilla )రాజ‌న్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండ‌లంలో బుధ‌వారం అర్ధరాత్రి దారుణం జ‌రిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల్యాల గ్రామానికి చెందిన ప‌డిగెల న‌రేశ్‌(25) ఉపాధి నిమిత్తం ఐదేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ప‌ది రోజుల క్రిత‌మే అత‌ను సొంతూరికి తిరిగొచ్చాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి న‌రేశ్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తుల‌తో దాడి చేశారు. దీంతో తీవ్ర […]

Bharat, a B.Tech student from Thirmanpally died of dengue – తిర్మన్‌పల్లికి చెందిన భరత్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు

డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి భరత్‌ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు […]