ED heat – ఈడీ హీట్‌….

హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత.. సుప్రీంకోర్టును కోరారు. కాగా, కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.  ఇ‍ప్పటికి మూడుసార్లు విచారణ..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం […]

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో యువ‌కుడు దారుణ హ‌త్య‌

(Rajanna Siricilla )రాజ‌న్న సిరిసిల్ల : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండ‌లంలో బుధ‌వారం అర్ధరాత్రి దారుణం జ‌రిగింది. మల్యాల గ్రామానికి చెందిన ఓ యువ‌కుడిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల్యాల గ్రామానికి చెందిన ప‌డిగెల న‌రేశ్‌(25) ఉపాధి నిమిత్తం ఐదేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. ప‌ది రోజుల క్రిత‌మే అత‌ను సొంతూరికి తిరిగొచ్చాడు. బుధ‌వారం అర్ధ‌రాత్రి న‌రేశ్‌పై గుర్తు తెలియ‌ని దుండ‌గులు క‌త్తుల‌తో దాడి చేశారు. దీంతో తీవ్ర […]

Bharat, a B.Tech student from Thirmanpally died of dengue – తిర్మన్‌పల్లికి చెందిన భరత్ అనే బీటెక్ విద్యార్థి డెంగ్యూతో మృతి చెందాడు

డెంగీ కేసులు జి ల్లాలో క్రమంగా పెరుగుతున్నాయి. ఇందల్‌వాయి మండలం తిర్మన్‌పల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి భరత్‌ డెంగీతో బుధవారం మృతి చెందాడు. జ్వరం రావడంతో ఇంటివద్ద మందులు వాడినా తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైద్రాబాద్‌లోని నిమ్స్‌కు తలించగా చికిత్స పొదు తూ మృతి చెందాడు. జిల్లాలో డెంగీ జ్వరంతో నెలలో ఒకరిద్దరు మరణిస్తున్నారు. రెండు […]

Four died of dengue in Mulugu district – ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని…

ములుగు: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్‌ సెల్‌ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ […]

Krishnamma for drought soil – సరిపడా వర్షాలు లేని సమయంలో కృష్ణమ్మ నేలను ఆదుకుంటుంది……

మహబూబ్‌నగర్:  కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కే గడియ రానే వచ్చింది. 2015లోనే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అంకురార్పణ జరగ్గా, దాదాపు ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ కల సాకారం కానుంది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నార్లాపూర్‌ పంపుహౌస్, కృష్ణాతీరంలోని హెడ్‌రెగ్యులేటరీ ఇన్‌టేక్‌ వద్ద, కొల్లాపూర్‌ చుట్టుపక్కల పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం […]

Oppositions are playing the role of an omen – సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి…

ఖమ్మం: ‘సీఎం కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభిస్తామంటే ప్రతిపక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయి..కాళేశ్వరంకన్నా పెద్దదైన ఈ ప్రాజెక్టు పాలమూరు ప్రజల కరువు తీరుస్తుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి.. మనకు పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌..గోబెల్స్‌కు మధ్యే పోటీ. మరింత అభివృద్ధి కోసం కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ప్రజలు ఇప్ప టికే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని నిర్ణయించుకున్నా రు’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి […]

my focus is on Karimnagar says Bandi Sanjay – ఇక నా దృష్టి కరీంనగర్‌ ‘పార్లమెంట్‌’పైనే అని చెప్పిన బండి సంజయ్ …

కరీంనగర్‌టౌన్‌: ఇకపై కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజక వర్గంపైనే ప్రత్యేక దృష్టి సా రించనున్నట్లు బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అందులో భాగంగానే ఎక్కువ సమయం నియోజ కవర్గానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ దమ్ము చూపిస్తామని, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. గురువారం ఆయన కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో బీజేపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నేతల తో సంస్థాగత బలోపేతంపై సమావేశం […]

Minister Koppula – మంత్రి కొప్పుల కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని అన్నారు

జగిత్యాల : బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మే నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాగా, అతడికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో రెండు లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఈ మేరకు 2 లక్షల రూపాయల చెక్కును గంగాధర్ భార్య జమునకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన […]

Minister KTR responded on jahnavi’s death -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం : మంత్రి కేటీఆర్

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

Another ED notice to Kavitha! – కవితకు మరోసారి ఈడీ నోటీస్! రేపే అరెస్ట్ ఉంటుందా!?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు షికార్లు […]