Avoid Falling For Paid Sample Paper Scams – పెయిడ్‌ శాంపిల్‌ పేపర్స్‌ మోసాలపై జాగ్రత్త

తాము ఏ ప్రైవేటు ప్రచురణ సంస్థతోనూ 10, 12 తరగతులకు సంబంధించిన పెయిడ్‌ శాంపిల్‌ పేపర్స్‌పై ఒప్పందం చేసుకోలేదని, ఎవరైనా అటువంటి ప్రచారం చేస్తే నమ్మవద్దని సీబీఎస్‌ఈ(CBSE) స్పష్టం చేసింది. ఎడ్యుకార్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఖండించింది. కొన్ని పాఠశాలలకు అటువంటి విజ్ఞప్తులు వస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, మోసపోవద్దని సూచించింది.

The Plane Crashed Sideways While Landing In Mumbai In Heavy Rain – భారీ వర్షంలో ముంబైలో ల్యాండ్ అవుతుండగా పక్కకి ఒరిగి ప్రమాదానికి గురైన విమానం

నగరంలోని ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ఓ ప్రైవేట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించగా.. అది రన్‌వే నుంచి జారి పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే 27పై ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్‌ సమయంలో విమానంలో మొత్తం ఎనిమిది మంది(ఇద్దరు సిబ్బందిసహా) ఉన్నారని సమాచారం. వాళ్లలో గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించినట్లు అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అయితే వాళ్లకు ఏ తీవ్రత మేర గాయాలు అయిన విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.  […]

Udhayanidhi Stalin Hits Out At Amit Shah – అమిత్ షాపై ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు

హిందీ భాష దేశంలోని ఇతర భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తోందని, అన్ని భాషలను, యాసలను గౌరవిస్తోందని ‘హిందీ దివస్‌’ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఇచి్చన సందేశాన్ని తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ గురువారం తప్పుపట్టారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అమిత్‌ షా సందేశం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఎలా ఏకం చేస్తుందని ఉదయనిధి స్టాలిన్‌ ప్రశ్నించారు. ఈ […]

Attempts To Bring An End To Sanatana Dharma – సనాతన ధర్మాన్ని అంతం చేసే ప్రయత్నం

‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్‌’ అంటూ నెలకొరిగారు. రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ […]

Nipah Virus Is Creating A Stir In Kerala Again – కేరళలో మళ్లీ నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది

తాజాగా కొయ్‌కోడ్‌కు చెందిన 39 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. ప్రస్తుత కేసుతో ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇంతకుముందు నిఫా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు చికిత్స అందించిన ఆసుపత్రిలోనే ఈ వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారని ఆరోగ్యశాఖ తెలిపింది. నిఫా వ్యాప్తిని కట్టడిలో […]

The Head Of Tesla Who Once Again Spoke Against Taiwan – తైవాన్ కు వ్యతిరేకంగా మరోసారి మాట్లాడిన టెస్లా అధిపతి తీవ్ర ప్రతిస్పందనను ఎదుర్కొన్నాడు

చైనా (China) పక్షాన మాట్లాడుతూ తైవాన్‌(Taiwan)పై మరోసారి నోరు పారేసుకొన్న టెస్లా అధినేతకు ఘాటు జవాబు ఎదురైంది. మాకు సలహాలు చెప్పే బదులు చైనాలో నీ సంగతేమిటో చూసుకో అన్నట్లు తైవాన్‌ జవాబు చెప్పింది. ఇటీవల జరిగిన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఆల్‌-ఇన్‌ సదస్సులో ఎలాన్‌ మస్క్‌ (Elon Musks) రిమోట్‌ విధానంలో ప్రసంగించారు. అమెరికాకు హవాయి వలే చైనాకు తైవాన్‌ అని వ్యాఖ్యానించారు. ‘‘నాకు బాగా తెలుసు.. తైవాన్‌ను చైనాలో విలీనం చేసుకొనేలా బీజింగ్‌ విధానాలు […]

Minister KTR responded on jahnavi’s death -జాహ్న‌వి మృతి క‌ల‌చివేసింది.. అమెరికా పోలీసు ప్ర‌వ‌ర్త‌న బాధాక‌రం : మంత్రి కేటీఆర్

Minister KTR | క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పోలీసు అధికారి నిర్ద్వంద వ్యాఖ్య‌ల‌కు తీవ్రంగా క‌ల‌త చెందిన‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. భార‌త్‌లోని అమెరికా రాయ‌బారి యూఎస్ ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించి, జాహ్న‌వి కుటుంబానికి న్యాయం చేయాల‌ని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. […]

Another ED notice to Kavitha! – కవితకు మరోసారి ఈడీ నోటీస్! రేపే అరెస్ట్ ఉంటుందా!?

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే (శుక్రవారం) విచారణకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొంది. దీంతో ఏం జరుగుతోందోనన్న సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. గతంలోనే కవితను అరెస్ట్ చేస్తారని వార్తలు షికార్లు […]

Kalvakuntla firey comments on ED Notices – ఈడి నోటీసు లు గురించి విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత

 నిజామాబాద్: రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని.. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ నోటీసుల పరిణామంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. నోటీసులు అందించిన విషయాన్ని ఇవాళ నిజామాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ధృవీకరించారామె. ఈ క్రమంలో ఈడీ నోటీసులపై సెటైర్లు సంధించారు. నోటీసులు అందాయి. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని ముందు నుంచి చెబుతున్నాం. మళ్లీ రాజకీయం కోసమే పంపారు. ఇవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు. తెలంగాణలో నెలకొన్ని రాజకీయ వాతావరణం, ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ నోటీసులు పంపారు. తెలంగాణ ప్రజలు […]

Another drug stain on Tollywood – టాలీవుడ్‌ తెరపై మరో డ్రగ్‌ మరక…

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (టీఎస్‌–నాబ్‌) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్‌ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉండగా… గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ […]