PM Modi’s response to the Israel Embassy.. – ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ప్రధాని మోదీ స్పందన..

సెప్టెంబరు 14న హిందీ దినోత్సవాన్ని (Hindi Diwas) పురస్కరించుకుని ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయ (Israeli embassy) ప్రతినిధులు ఓ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi) రిప్లై ఇచ్చారు. గురువారం హిందీ దివస్‌ సందర్భంగా హిందీ భాష ప్రత్యేకతను తెలుపుతూ ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయ అధికారులు పలు ప్రముఖ హిందీ సినిమా డైలాగులను (Hindi film dialogues) చెబుతూ వీడియోను ఎక్స్‌(ట్విటర్‌)లో పంచుకున్నారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో భారత […]

Pakistan is looking to create havoc in India – భారత్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న పాక్‌

భారత్‌ (India)లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్న దాయాది పాక్‌ (Pakistan) కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (Pakistan-Occupied Kashmir)లోని శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులకు పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐ అధునాతన చైనా ఆయుధాల (Chinese weapons)ను అందిస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పిస్తోళ్లు, గ్రనేడ్లు, నైట్‌ విజన్‌ పరికరాలు తదితర ఆయుధాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. […]

ISRO Has Successfully Carried Out The Fourth Earth Orbit Raising Process.. – నాలుగో భూ కక్ష్య పెంపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది..

సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 లక్ష్యం దిశగా సాగుతోంది. ఆదిత్య ఎల్‌-1 (Aditya L1 Mission)ఉపగ్రహానికి మంగళవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో(ISRO) గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం  256 km x 121973 km కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి […]

Opposition Was Furious – ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి..

జమ్మూకశ్మీరులో సైనికులు అమరులైన రోజు.. భాజపా తమ కేంద్ర కార్యాలయంలో జీ20 సదస్సు విజయోత్సవాలు జరుపుకోవడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఎంతటి దుర్ఘటన జరిగినా.. ప్రధాని ప్రశంసలు అందుకోవడం మానరని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. ‘‘మృతి చెందిన వారి చిన్నారుల చిత్రాలను చూస్తుంటే నా హృదయం బద్దలైపోతోంది. ఇక్కడ మాత్రం సంబరాలు ఆగలేదు? పుల్వామాలో 40 మంది వీరులు ప్రాణాలు కోల్పోయినా.. మోదీ షూటింగ్‌ కార్యక్రమాన్ని ఆపలేదు. ఇది ఊహించలేని క్రూరత్వం’’ అని కాంగ్రెస్‌ నేత సుప్రియ శ్రీనేత్‌ అన్నారు. […]

Kerala : Preparation Of ‘Nipah’ Drug – కేరళ: ‘నిపా’ మందు తయారీ

నిఫా వైరస్‌ బాధితులకు చికిత్సలో ఉపయోగించే మోనోక్లోనల్‌ యాంటీబాడీ ఔషధం రాష్ట్రానికి చేరుకుందని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిఫా వైరస్‌ను తగ్గిస్తుందని నిర్ధారణ కాకపోయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమమైందని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో గురువారం ఉదయం సమావేశానంతరం సాయంత్రానికి మందు రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. తదుపరి చర్యలపై నిపుణుల కమిటీ సూచనలిస్తుందని వెల్లడించారు. ఎం102.4 మోనోక్లోనల్‌ యాంటీబాడీ మందును ప్రయోగాత్మక పరిశీలన కోసం 2018లో కేంద్రం […]

Will They Send A Junior Lawyer Who Lacks Experience To Ask For A Delay? – అనుభవం లేని జూనియర్ లాయర్‌ని పంపిస్తారా?

కేసు వాయిదా కోరడానికి తన స్థానంలో జూనియర్‌ న్యాయవాదిని పంపిన ‘అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌’పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 వేలు జరిమానా కట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టులో కక్షిదారుల తరఫున ప్రాతినిధ్యం వహించడానికి, వారి తరఫున కేసులు దాఖలు చేయడానికి అధికారం ఉన్న వకీలును ‘అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌’ అంటారు. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన ఓ కేసులో జూనియర్‌ న్యాయవాది హాజరయ్యారు. ప్రధాన న్యాయవాది అందుబాటులో […]

Some Prisoners Are Receiving “Excessive Benefits” – కొంతమంది ఖైదీలు “అధిక ప్రయోజనాలు” పొందుతున్నారు

కొంతమంది దోషులకు ‘ఎక్కువ ప్రయోజనాలు’ ఉంటుంటాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గోధ్రా అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న బిల్కిస్‌బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు వ్యక్తుల హత్యలో దోషులుగా ఉన్నవారిని ఖైదు నుంచి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. దోషుల్లో ఒకరైన రమేశ్‌ రూపాభాయ్‌ చందానా తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హాజరయ్యారు. యావజ్జీవ శిక్ష పడినవారిలో పరివర్తన, పునరావాసం కోసం […]

Another Drug Stain On Tollywood – టాలీవుడ్‌ తెరపై మరో డ్రగ్‌ మరక…

టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (టీఎస్‌–నాబ్‌) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్‌ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉండగా… గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పారు. ఐసీసీసీలో టీఎస్‌–నాబ్‌ ఎస్పీ (వెస్ట్‌) డి.సునీతా […]

ED Heat – ఈడీ హీట్‌….

హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత.. సుప్రీంకోర్టును కోరారు. కాగా, కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.  ఇ‍ప్పటికి మూడుసార్లు విచారణ..ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం […]

“Didi Was Seen Jogging In A Saree” – “దీదీ చీరలో జాగింగ్ చేస్తూ కనిపించారు”

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ సందర్భాల్లో తెలియజేశారు. ప్రస్తుతం స్పెయిన్‌ పర్యటనలో ఉన్న దీదీ.. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్‌ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీదీ తెల్ల చీర ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్‌ చేశారు. ‘‘ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వ్యాయామం మీకు శక్తినిస్తుంది. అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండండి’’ అని […]