NIT Student suicide.. – ఎన్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య..

విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఎన్‌ఐటీ(NIT) ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులు చేస్తోన్న ఆందోళనను పోలీసులు కట్టడి చేసే క్రమంలో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ దృశ్యాలు అస్సాం(Assam)లోని ఎన్‌ఐటీ సిల్చార్ క్యాంపస్‌లో వెలుగులోకి వచ్చాయి. (NIT Silchar suicide) అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ఎన్‌ఐటీ సిల్చార్‌( NIT Silchar)లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌ మూడో సెమిస్టర్ చదువుతున్నాడు. అతడు బ్యాక్‌లాగ్స్‌ క్లియర్ చేయలేకపోయాడు. దాంతో తర్వాత సెమిస్టర్‌కు రిజిస్టర్ చేసుకోవడం కోసం అతడు […]

young couple-రోడ్డు ప్రమాదంలో మృతి

నల్గొండ : ఇటీవలే పెళ్లి చేసుకున్న ఓ యువ జంట ఇసుకను తరలించే వాహనం  ఢీకొని మృతి చెందింది. ఇది తాటికల్ అనే గ్రామం అంచున జరిగింది. భర్త పేరు మహేష్ మరియు అతని వయస్సు 23 సంవత్సరాలు. భార్య రుషిత వయసు 19 ఏళ్లు. వీరికి పెళ్లయి ఒక నెల మాత్రమే అయింది. బుధవారం సాయంత్రం నల్గొండలోని తమ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారు మోటారు సైకిల్‌పై ప్రయాణించి తమతో పాటు కొన్ని […]

The situation is still terrifying In the city of Derna in Libya. – లిబియాలోని డెర్నా నగరంలో ఇప్పటికీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

డేనియల్‌ తుపాను సృష్టించిన జలప్రళయంతో లిబియాలోని డెర్నా నగరంలో ఇప్పటికీ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నివాస ప్రాంతాలు, వీధుల్లో ఎటుచూసినా బురద మేటలు కనిపిస్తున్నాయి. వాటి కింద శవాలు గుట్టలుగా బయటపడుతున్నాయి. మరోవైపు సముద్ర జలాల నుంచి వందల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. గురువారం నాటికి ఈ నగరంలో 11,300 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన మరో 10,100 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. వారంతా మరణించి ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మృతుల సంఖ్య […]

Kim Jong Un has invited Putin to visit his country… – కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని సందర్శించాల్సిందిగా పుతిన్‌ను కోరారు

రష్యా పర్యటనలో ఉన్న ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తమ దేశంలో పర్యటించాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. దీనికి రష్యా అధ్యక్షుడు కూడా అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. మరోవైపు ఇరువురు నేతల చర్చల్లో ప్రధానంగా సైనిక అంశాలే ప్రస్తావనకు వచ్చాయని సమాచారం. ఇటీవల ఉత్తరకొరియా చేసిన క్షిపణి ప్రయోగాలు చాలా సందర్భాల్లో విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో రష్యా అందించే టెక్నాలజీ కీలకమని కిమ్‌ భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరకొరియా ఉపగ్రహ, […]

Pir Panjal mountain ranges have become the habitat of terrorists – పీర్ పంజాల్ పర్వత శ్రేణులు ఉగ్రవాదులకు ఆవాసంగా మారాయి

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులు.. ఉగ్రనాగులకు ఆవాసంగా మారాయి. గతంలో పాక్‌ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు నక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో ఒక కర్నల్‌, మేజర్‌, కశ్మీరీ పోలీసు డీఎస్పీ, ఓ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సైనికుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి మంగళవారం ఇక్కడ ఉగ్రకదలికలు తెలుసుకొని రాష్టీయ్ర రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు గాలింపు […]

Renu Desai: రేణూ దేశాయ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ఆగస్టులో తాను పెట్టిన ఓ పోస్ట్‌పై నెటిజన్ కామెంట్‌ చేయగా నటి రేణూ దేశాయ్‌ స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ఏం జరిగిందంటే?‘తెలుగు చలన చిత్ర పరిశ్రమ కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించింది కాదు.. అందరిదీ. మమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించకండి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘తప్పుదోవ పట్టించేందుకు మీరేమైనా చిన్నపిల్లాడా? ముర్ఖులా? మీరు పరిష్కారం లభించని సమస్యలతో ఉన్న వ్యక్తి. మీరు చేయలేని […]

Nipah – A virus which is more dangerous than Covid – నిపా – కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్

కొవిడ్‌తో పోల్చితే నిఫా వైరస్‌ అత్యంత ప్రమాదకరమైనదని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. కొవిడ్‌ కేసుల్లో మరణాలు 2 – 3 శాతం మాత్రమే ఉండగా.. నిఫా వైరస్‌ వల్ల 40 – 70 శాతం ఉంటాయని పేర్కొంది. కేరళలో ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇంకా తెలియలేదని, నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకొంటున్నామని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ శుక్రవారం తెలిపారు. ‘‘ఐసీఎంఆర్‌ వద్ద ప్రస్తుతం 10 […]

NASA responded about the Strange shapes that appeared in the Parliament of Mexico – మెక్సికో పార్లమెంటులో కనిపించిన వింత ఆకృతులపై నాసా స్పందించింది

గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా(Alien corpses) భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు మెక్సికో(Mexico) పార్లమెంట్‌కు తీసుకొచ్చారు. దీనిపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA) తన అభిప్రాయం వ్యక్తం చేసింది. వాస్తవంగా అవి ఏంటో స్పష్టత లేదని, అయితే ఈ విషయంలో పారదర్శకత ముఖ్యమని పేర్కొంది. మెక్సికో(Mexico) పార్లమెంట్‌లో వింత ఆకారాల ప్రదర్శన గురించి మాట్లాడుతూ..‘సామాజిక మాధ్యమాల్లోనే నేను వీటిని చూశాను. ఏవైనా అసాధారణ విషయాలు మీ దృష్టికి వచ్చినప్పుడు.. వాటికి సంబంధించిన సమాచారం తెలియాలనుకుంటారు. అయితే ఆ […]

The plane descended 28 thousand feet within 10 minutes.. – 10 నిమిషాల్లోనే 28 వేల అడుగుల కిందికి దిగిన విమానం..

విమానం (Flight) గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రయాణికులకు అనూహ్య అనుభవం ఎదురైంది. 10 నిమిషాల వ్యవధిలో విమానం 28 వేల అడుగులు కిందికి దిగిరావడంతో అందులోని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌( United Airlines)కు చెందిన విమానం(Flight) 270 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో న్యూజెర్సీలోని నెవార్క్‌ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి రోమ్‌కు బయలుదేరింది. కానీ, ఆ తర్వాత కొద్ది గంటలకే టేకాఫ్ అయిన చోటే ల్యాండ్ అయింది. […]

Services were interrupted.. Flights were stopped – సర్వీసులకు అంతరాయం కలిగింది.. విమానాలు నిలిచిపోయాయి

ఇంగ్లాండ్‌లోని లండన్‌ మహా నగరంలో గాట్విక్‌ (Gatwick) అంతర్జాతీయ విమానాశ్రయం సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఇప్పటికే 22 విమానాలను రద్దు చేసినట్లు షార్ట్‌ నోటీస్‌ వెలువరించింది. దీంతోపాటు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన వందలాది విమానాల్లో తీవ్ర జాప్యం నెలకుంటోందని ఫ్లైట్‌ రాడార్‌ 24 పేర్కొంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. దీంతో నాట్స్‌ (నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌) ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది. శుక్రవారం ఉదయం […]