Gutha Sukhender Fire – గుత్తా సుఖేందర్‌ ఫైర్‌….

నల్లగొండ: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాగా, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని […]

The first mission undertaken by the ISRO to explore the secrets of the Sun, has revealed another milestone – సూర్యుడి రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది

సూర్యుడి(Sun) రహస్యాలను శోధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) చేపట్టిన తొలి మిషన్‌ ఆదిత్య ఎల్‌-1(Aditya L1) ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌-1(Trans-Lagrangian Point 1) దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి ఇస్రో తాజాగా ఎక్స్‌(ట్విటర్‌లో) పోస్టు చేసింది. ట్రాన్స్‌-లగ్రేంజియన్‌ పాయింట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం వాహక నౌక(Space Carft) లగ్రాంజ్‌(Langrnge) పాయింట్‌-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ […]

Drug Case – డ్రగ్స్ కేసులో కీలక మలుపు…

Hyderabad: మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉ‍న్న టాలీవుడ్ నటుడు నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. అయితే పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్‌చంద్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో నవదీప్ ఇప్పటికే మరో పిటిషన్ దాఖలు […]

పార్లమెంట్‌ పాత భవనానికి వీడ్కోలు పలికిన ఎంపీలు – MPs bid farewell to the old Parliament building

స్వతంత్ర భారత్‌లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్‌ సాక్షిగా మిగలనుంది. మరికొన్ని గంటల్లో చట్టసభల కార్యకలాపాలు కొత్త భవనం(parliament new building)లోకి మారనున్నాయి. ఈ సమయంలో పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. వారంతా దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంట్‌ ప్రాంగణానికి వచ్చారు. (Parliament Special Session) మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటోకు పోజు ఇచ్చారు. తర్వాత రాజ్యసభ […]

New Parliament Building – నూతన పార్లమెంటు భవనం

నూతన పార్లమెంటు భవనం (New Parliament Building)లో సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మంగళవారం నుంచి నూతన భవనంలోనే కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్‌ సభ్యులు తొలిసారి నూతన భవనంలో అడుగుపెట్టనున్నారు. ఈ విశిష్ట సందర్భానికి గుర్తుగా సభికులకు కేంద్రం ప్రత్యేక కానుక (Hamper)లు అందజేయనున్నట్లు తెలుస్తోంది. జనపనారతో రూపొందించిన బ్యాగులో భారత రాజ్యాంగ ప్రతి, పాత, కొత్త పార్లమెంటు భవనాల చిత్రాలతో కూడిన స్టాంపులు, స్మారక నాణెం అందివ్వనుంది. ఆ బ్యాగులపై […]

Youth arrested for rape in ESI hospital – ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్‌

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఓ రోగి సోదరిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లిఫ్ట్‌లో ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు షాబాద్‌ అనే యువకుడు. మూడు రోజుల నుంచి పరారీలో ఉన్న షాబాద్‌ను ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. తన సోదరుడి చికిత్స కోసం కర్ణాకట నుంచి ఈఎస్‌ఐ ఆసుపత్రికి యువతి రాగా, అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది.  కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల యువతి.. సోదరుడు జారి పడిపోవడంతో […]

Union Cabinet approved the Women’s Reservation Bill.. – చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను […]

Union Cabinet approved the Women’s Reservation Bill.. – చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు (Womens Reservation Bill) కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్‌ డిమాండ్‌ను […]

Diplomatic tensions between India and Canada have worsened over the Khalistani issue – ఖలిస్థానీ అంశంతో భారత్‌-కెనడా (India-Canada) మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి

ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్త (Indian diplomat)పై బహిష్కరణ వేటు  పడింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ అధిపతిని బహిష్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను భారత విదేశాంగశాఖ […]

Tensions between India and Canada are getting darker – భారత్‌, కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించిన కెనడా.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్‌.. కెనడాకు గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది. భారత్‌కు కెనడా హైకమిషనర్‌ అయిన కామెరూన్‌ మెక్‌కేకు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) నేడు […]