HUGE RALLY TO VIJAYABHERI ASSEMBLY – విజయభేరి సభకు భారీగా ర్యాలీ

ఖమ్మంమయూరిసెంటర్‌: హైదరాబాద్‌ తుక్కుగూడలో ఆదివా రం నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభకు ఉమ్మడి జిల్లాలోని టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్‌, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు, కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈమేరకు వెయ్యికి పైగా కార్లలో పొంగులేటి అభిమానులు, అనుచరులు కార్లలో బయలుదేరారు. వివిధ నియోజకవర్గాల నుంచి వాహనాలు ఖమ్మం చేరుకోగా.. కాంగ్రెస్‌ మేన్‌ఫెస్టో కమిటీ సభ్యుడు మువ్వా విజయబాబు, క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికి ముందుకు సాగారు.

Plants can protect the environment – మొక్కలను ఉపయోగించి పర్యావరణాన్ని సంరక్షించండి.

సింగరేణి డైరెక్టర్లు ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వర రెడ్డి ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడంతోపాటు మానవుడు ప్రకృతితో మమేకమై జీవించవచ్చని చూపించారు. సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీ అనే స్థలంలో మొక్కలు నాటారు. తెలంగాణలో హరితహారం అనే కార్యక్రమంలో సింగరేణి ముందుంది. చెట్లు స్వచ్ఛమైన గాలిని అందించడంతో పాటు వాతావరణం సమతుల్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆ ప్రాంత ప్రజలు సంతోషిస్తున్నారు. మొక్కలు నాటిన అనంతరం డైరెక్టర్లు కిష్టారం, జేవీఆర్ ఓసీలలో బొగ్గు ఉత్పత్తి, రవాణా ఎలా […]

Tensions have arisen between China and Taiwan once again – చైనా, తైవాన్‌ల​మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

తైవాన్‌ (Taiwan) తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా (China).. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్‌ దిశగా పంపడం గమనార్హం. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద […]

India-Canada differences that started on the stage of the G20 summit have become more divisive – జీ20 వేదికపై మొదలైన భారత్-కెనడా విభేదాలు మరింత చిచ్చు రేపాయి

జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్‌-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ను ధ్వంసం చేసి.. ‘‘జూన్‌ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి ఓ భారత దౌత్యవేత్తను తమ దేశం నుంచి […]

There is no arms distribution agreement with Ukraine says Pak – ఉక్రెయిన్‌తో ఎలాంటి ఆయుధాల పంపిణీ ఒప్పందం లేదని పాక్‌ చెబుతోంది

పాకిస్థాన్‌ (Pakistan) ఐఎంఎఫ్‌ ప్యాకేజీ పొందేందుకు ఏకంగా ఉక్రెయిన్‌ (Ukraine)కు ఆయుధాలను సరఫరా చేస్తోందనే నివేదికలు వెలువడుతున్నాయి. అయితే.. ఈ నివేదికలను పాక్‌ విదేశాంగశాఖ కార్యాలయం తోసిపుచ్చింది. ఈ మేరకు కార్యాలయ ప్రతినిధి ముంతాజ్‌ జారా బలోచ్‌ మాట్లాడుతూ.. అటువంటి ఆరోపణలు పూర్తిగా ఆధార రహితమని, అభూత కల్పనలని ఖండించారు. ‘ఇంటర్‌సెప్ట్‌’ అనే ఇన్వెస్టిగేటివ్‌ వెబ్‌సైట్‌ ఆదివారం ఓ నివేదికను ప్రచురించింది. దీనిలో అమెరికా సాయంతో ఐఎంఎఫ్‌ బెయిలౌట్‌ ప్యాకేజీ పొందేందుకు పాకిస్థాన్‌ రహస్యంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు […]

Child born with 26 fingers.. – 26 వేళ్లతో జన్మించిన చిన్నారి..

రాజస్థాన్‌(Rajasthan)లో ఓ మహిళ సోమవారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారికి పుట్టుకతోనే 26 వేళ్లున్నాయి. ఇలా 26 వేళ్లతో పుట్టడం చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతుంది. జెనెటిక్‌ డిజార్డర్‌(genetic desorder) వల్లే ఇలా జరుగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. మరోవైపు తాము పూజించే దేవత తమ ఇంట్లో పుట్టిందని కుటుంబ సభ్యులు ఆనంద పడిపోతున్నారు.  రాజస్థాన్‌లోని దీగ్‌ జిల్లాలో ఓ మహిళ ఆదివారం రాత్రి అమ్మాయికి జన్మనిచ్చింది. ఆ చిన్నారి రెండు చేతులకు 7 వేళ్లు […]

Arya Rajendran : A role model for many women – ఆర్య రాజేంద్రన్: చాలా మంది మహిళలకు రోల్ మోడల్

ఆర్య రాజేంద్రన్‌ (Arya Rajendran).. అతి పిన్న వయసులోనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం (Thiruvananthapuram) మేయర్‌గా ఎన్నికై యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. 2020లో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆమె వయసు 21 సంవత్సరాలే. కొన్ని రోజుల తర్వాత ఆర్య రాజేంద్రన్‌ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే సచిన్‌ దేవ్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన కూడా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆగస్టు 10వ తేదీన ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. ప్రసవం జరిగి నెల […]

CLAY GANESH FOR A FOUR DECADES – మట్టి తో వినాయకుడిని 40 ఏళ్లుగా.

నాలుగు దశాబ్దాలుగా మట్టి ప్రతిమను పూజిస్తూ వస్తున్న గిరిజనులు పర్యావరణ పరిరక్షణలో మేముసైతమంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెదమిడిసిలేరు అనే ఊళ్లో మట్టితో శిల్పాన్ని రూపొందిస్తున్న వ్యక్తి గొంది చిరంజీవి. మట్టితో చేసిన ప్రతిమను చాలా కాలంగా పూజిస్తున్నవారు కొందరున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారు తీసుకుంటున్న జాగ్రత్తలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పెదమిడిసిలేరు అనే ప్రాంతంలో గిరిజన యువకులు ఏటా వినాయకుడు అనే దేవుడికి ఉత్సవం నిర్వహిస్తుంటారు. వేడుకలో భాగంగా వారే విగ్రహాన్ని తయారు చేస్తారు. ఈరోజు మట్టితో చేసిన పెద్ద గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి సంబరాలకు సిద్ధమయ్యారు. లింగాపురం […]

Another historical building in India has entered the list of world heritage buildings – ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్‌లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది

కర్ణాటకలోని ‘హోయసల’ (Hoysala) ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో (UNESCO) వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్‌, హళేబీడ్‌, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ ‘వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని ‘శాంతినికేతన్‌’కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలు ఈ జాబితాలో చేరడం విశేషం. హోయసలకు ఈ గౌరవం దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ‘యునెస్కో […]

Bodan Constituency – బోధన్ నియోజక వర్గం….

నిజామాబాద్‌: బోధన్ నియోజక వర్గంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది.  నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో జన్నెపల్లి, సిరన్‌పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని ఆయకట్టు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఈ కాలువ గండిపడి రైతులు ఏళ్లకాలంగా నష్టపోతున్నారు. ఈ సమస్య ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. బోధన్‌లో మూతపడి ఉన్న నిజాం షుగర్స్‌ ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారబోతుంది. అధికారంలోకి వస్తే 100 […]