Odisha police AP – ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(AOB)ల్లో ‘పుష్ప’ సినిమా తరహా సీన్‌ చోటుచేసుకుంది. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు ఒడిశా పోలీసులు చుక్కలు చూపించారు. చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యాన్ ఆగకుండా దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మరో వాహనంలో వారిని వెంబడించారు. అయితే, స్మగ్లర్లు తప్పించుకునేందుకు గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా ఒక్కోటి చొప్పున వేసుకుంటూ పోయిన పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయింది. ఈ సందర్భంగా దాదాపు […]

drug suspects’ – డ్రగ్స్ అనుమానితుల సెల్ ఫోన్లలో సినీ తారల

నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేయడం, రేవ్‌ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించడం, మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారమెత్తడం, ఇదీ మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన నిందితుల అసలు రూపం. నిందితులు బాలాజీ, రాంకిశోర్‌, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్‌ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో టీఎస్‌న్యాబ్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సినీ […]

‘Socialist, Secular’ Constitution.. – రాజ్యాంగ పీఠికలో ‘సోషలిస్ట్‌, సెక్యులర్‌’ మాయం..

పార్లమెంటు కొత్త భవనంలోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ ప్రతులను (Constitution of India) అందించారు. అయితే, అందులోని పీఠికలో సోషలిస్ట్‌, సెక్యులర్‌ పదాలు లేకపోవడం వివాదాస్పదమయ్యింది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi)తోపాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని తొలగించడం రాజ్యాంగంపై దాడేనన్నారు. ఎంపీలకు (సెప్టెంబర్‌ 19న) ఇచ్చిన రాజ్యాంగ కొత్త కాపీల్లోని పీఠికలో ‘సోషలిస్ట్‌, సెక్యులర్‌’ పదాలు లేవు అని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ పేర్కొన్నారు. […]

Full fare for children..Rs. 2800 crore revenue for railways – పిల్లలకు ఫుల్‌ ఫేర్‌.. రైల్వేకు రూ.2800 కోట్ల ఆదాయం

రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు (Indian Railways) రూ.2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరుంది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.560 కోట్లు వచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆర్‌టీఐ (RTI) దరఖాస్తుకు రైల్వే శాఖ పరిధిలోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS) సమాచారం ఇచ్చింది. రైళ్లలో ఒకప్పుడు 5-12 ఏళ్ల చిన్నారులకు సపరేట్‌ బెర్త్‌ […]

Image of Pakistan flag on the Ganges – అంతరగంగపై పాకిస్తాన్‌ జెండా చిత్రం

నగర సమీపంలోని అంతరగంగ పర్వతంపై ఉన్న బండరాళ్లపై కొందరు ఆకతాయిలు పాకిస్తాస్‌ ధ్వజం పోలిన రంగును పూయడంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై పోలీసులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదన్నారు. అయితే ఘటన వివాదం కాకముందే మరుసటి రోజునే దీనికి తెల్లరంగును పూసి పూర్తిగా తుడిచి వేశారు. దీనిపై పోలీసులు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు.

NITI Aayog has given Visakhapatnam a place among growth hub cities – నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్‌ గ్రోత్‌ హబ్‌ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది.  దేశంలో శరవేగంగా అభి­వృద్ధి చెందుతున్న నగరాల్లో నాలుగు నగరాలను నీతి ఆయోగ్‌ ఎంపిక చేయగా అందులో వైజాగ్‌కు చోటు దక్కింది.. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా, మిగతా వాటిలో ముంబై, సూరత్‌, వారణాసి ఉన్నాయి. వీటిని పైలట్‌ నగరాలుగా కేంద్రం ఎంచుకుంది.  2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా,  తాజాగా ఎంపికైన […]

What is the relationship between China and Santiniketan? – చైనా మరియు శాంతినికేతన్ మధ్య సంబంధం ఏమిటి?

గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ యునెస్కో వారసత్వ జాబితాలో చేరింది. శాంతినికేతన్ నాటి రోజుల్లో భారతదేశంలో ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఒక విశ్వవిద్యాలయం. దీనిని మనం ఇప్పుడు విశ్వభారతి అని కూడా పిలుస్తున్నాం. గురుదేవులు శాంతి నికేతన్‌ను ప్రారంభించినప్పుడు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌.. త్రిపురతోపాటు అనేక రాజ కుటుంబాల నుండి ఆర్థిక సహాయం అందుకున్నారు. ఆ సమయంలో చైనా కూడా శాంతినికేతన్‌ నిర్వహణకు భారీగా ఆర్థిక సహాయం అందించింది.  […]

Soon, JNTU Engineering College will be sanctioned – త్వరలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు

వినాయక చవితి సందర్భంగా పాలమూరు జిల్లాకు జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల రానున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్ నగర్ కల్చరల్ : పాలమూరు జిల్లాకు జేఎన్ టీయూ ఇంజినీరింగ్ కళాశాల రానున్నట్లు వినాయక చవితి సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. త్వరలో జీవో కూడా వస్తుంది. సోమవారం రాత్రి పాత పాలమూరులో శ్రీ శివరామాంజనేయ భక్తసమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణపయ్యకు మంత్రి […]

Clashes in Madhya Pradesh.. – మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ..

త్వరలో మధ్యప్రదేశ్‌లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో వినాయక చవితి సందర్బంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలంతా కలిసి అధికార బీజీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జన ఆక్రోశ యాత్ర’కు శ్రీకారం చుట్టారు.  ఒకపక్క బీజేపీ పార్టీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,500 కిలోమీటర్లు యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. వారికి  దీటుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యాత్రను ప్రారంభించినట్లు తెలుస్తోంది.15 రోజులపాటు నిర్దేశించిన ఈ యాత్త్ర 11,400 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో 230 అసెంబ్లీ […]

Kaleswaram irrigation per acre: Minister – ఎకరాకు కాళేశ్వరం సాగునీరు: మంత్రి

కాళేశ్వరం నీటితో మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం పెదశంకరంపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. పెద్దశంకరంపేట: కాళేశ్వరం నుంచి మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పెదశంకరంపేటలో రెండు పడక గదుల ఇళ్లను ఆవిష్కరించారు. కట్టెల వెంకటాపురం వరకు హన్మంతరావుపేట, బిటి రోడ్లకు శంకుస్థాపనలు మొత్తం రూ. 2.94 కోట్లు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు […]