KTR bills – నా సీటు కోల్పోవాల్సి వచ్చినా సిద్ధమే..!

హైదరాబాద్‌: ‘భారత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ బిల్లు అమలులోకి వస్తే మరింతమంది మహిళానేతలు ప్రజాజీవితంలోకి వస్తారు. నేను నా సీటు కోల్పోవాల్సి వచ్చినా దానికి సిద్ధంగా ఉన్నా. మనందరివి చాలా చిన్నజీవితాలు, అందులో నా పాత్ర నేను పోషించాననే అనుకుంటున్నాను’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీ.రామారావు అన్నారు. ‘క్యాపిటా లాండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’(సీఎల్‌ఐ) కొత్తగా పునర్నిర్మించిన ‘ఇంటర్నేషనల్‌ టెక్‌ పార్క్‌ హైదరాబాద్‌’(ఐటీపీహెచ్‌)ను కేటీఆర్‌ బుధవారం ప్రారంభించారు. […]

Azerbaijan and Armenia, – అజర్‌బైజాన్ మరియు అర్మేనియా

అజర్‌బైజాన్‌, ఆర్మేనియా మధ్య వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్‌లో రెండు రోజులుగా కొనసాగుతున్న భీకర దాడులకు తాత్కాలికంగా తెర పడింది. మూడు దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇటీవల తారస్థాయికి చేరడంతో.. యుద్ధ మేఘాలు కమ్ముకొచ్చాయి. ఇలాంటి తరుణంలో రష్యా శాంతి పరిరక్షక దళం మధ్యవర్తిత్వంతో రెండు దేశాల బలగాల మధ్య బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆర్మేనియా మద్దతున్న వేర్పాటువాద నేతలు ఆయుధాలను విడిచిపెట్టనున్నట్లు ప్రకటించగానే, తాము సైనిక దాడులను నిలిపివేసినట్లు అజర్‌బైజాన్‌ […]

weather – వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది….

హైదరాబాద్‌:  రాష్ట్రంలో వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది. ఈసారి వానాకాలం మొదట్లో చినుకు జాడ లేక, తర్వాత భారీ వర్షాలు కురిసి.. ఆగస్టులో అయితే నెలంతా వానలు పడక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో మంచి వర్షాలే పడినా.. మళ్లీ వాతావరణం భిన్నంగా మారిపోయింది సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోతతోనూ ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ పరిస్థితి ఉండగా.. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి […]

Mahaganapati – మహాగణపతికి 2200 కిలోల లడ్డూ…

హైదరాబాద్: ఖైరతాబాద్‌ మహాగణపతికి బుధవారం లంగర్‌హౌస్‌కు చెందిన వ్యాపారవేత్త జనల్లి శ్రీకాంత్‌ 2200 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. 2016 నుంచి ప్రతి సంవత్సరం మహాగణపతికి లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు. భారీ లడ్డూను తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందని శ్రీకాంత్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం భారీ ఊరేగింపు మధ్య క్రేన్‌ సాయంతో మహాగణపతికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ లడ్డూను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారని […]

For No. 9999, 4.61 lakhs-నం. 9999కి, 4.61 లక్షలు

మంచిర్యాల్ రూరల్ (హాజీపూర్ ): బుధవారం మంచిర్యాల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి ఆన్ లైన్ లో కార్ నంబర్ బిడ్ లు నిర్వహించి భారీగా లాభాలు గడించారు. TS19H సిరీస్ ముగింపు మరియు TS19J సిరీస్ ప్రారంభంతో రవాణా శాఖ అపారమైన ఆదాయాన్ని పొందింది. మునుపటి సంవత్సరం సిరీస్‌లో, TS19H9999 నంబర్ కోసం ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా రూ. 3 లక్షలు, ఈ ఏడాది సిరీస్ ద్వారా రూ. 4,61,111. బుధవారం 12 వాహనాల అదృష్ట సంఖ్యల […]

Alert messages- దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌

దేశవ్యాప్తంగా సెల్‌ఫోన్‌లో అలర్ట్‌ మెసేజ్‌ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ రావడంతో​ కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్‌లో భాగంగానే ఇలా అలర్ట్‌ మెసేజ్‌ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది.  అయితే, దేశవ్యాప్తంగా గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్‌ఫోన్లకు వార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్‌ సౌండ్‌ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్‌ డిస్‌ప్లే అయ్యింది. ఈ అలర్ట్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత […]

Ganapati Bappa Morea.. – గణపతి బప్పా మోరియా..

దేశమంతటా గణేశ్‌ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో వెలసిన ప్రఖ్యాత దగడూసేఠ్‌ గణేశుని మండపంలో సంబరాలు ఘనంగా జరిగాయి. చవితిరోజు నుంచే ఘనంగా వేడుకలు జరగ్గా.. బుధవారం ఉదయం దాదాపు 36,000 మంది మహిళలు సామూహిక భజనలు చేశారు. గణపతి బప్పా మోరియా అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగింది. రుషి పంచమిలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న భక్తులు గణేశుని ముందు ‘అథర్వశీర్ష’ పారాయణం చేశారు. కొంతమంది రష్యన్లు, థాయిలాండ్‌ […]

Kurmi community – కుర్మీ సంఘాల ఆందోళన

ఎస్టీ హోదా కోసం కుర్మీ వర్గీయులు చేపట్టిన ఆందోళన కారణంగా ఆగ్నేయ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో బుధవారం పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. పట్నా – రాంచీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, హావ్‌డా – ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్‌ తదితరాలను దారి మళ్లించారు. రద్దయినవాటిలో హావ్‌డా- ముంబయి గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌, హటియా- ఖరగ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటివి ఉన్నాయి. ఝార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల పరిధిలో రైళ్లను అడ్డుకుంటామని కుర్మీ సమాజం హెచ్చరికలు జారీ […]

popular in Mancherial-మంచిర్యాలలో చిరుతపులి

వాట్సాప్ వినియోగదారులు బొగ్గు గనుల పట్టణం శ్రీరాంపూర్‌కు సమీపంలో ఉన్న చిరుతపులిని చూసేందుకు జాతీయ మార్గం 363లో డ్రైవర్లను హెచ్చరించే వీడియోను విస్తృతంగా ప్రచారం చేశారు. మంచిర్యాల: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారిపై చిరుతపులి కూర్చొని అరుస్తున్నట్లు, డ్రైవర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వాట్సాప్ వినియోగదారులు బొగ్గు గనుల పట్టణం శ్రీరాంపూర్‌కు సమీపంలో ఉన్న చిరుతపులిని చూసేందుకు జాతీయ మార్గం 363లో డ్రైవర్లను హెచ్చరించే వీడియోను విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే […]