Vaddiraju RaviChandra : తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణాభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక ఏవీఆర్ వేడుకల మందిరంలో శుక్రవారం భారాస మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరుతోందన్నారు. కాంగ్రెస్, భాజపా ఎన్నికలకు ముందు హామీలతో బురిడీలు కొట్టించి ప్రజలను మాయచేస్తారన్నారు. వారి ప్రలోభాలకు గురి కాకుడదన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించి అవిరామంగా పాటుపడ్డారని […]