Israel – హెజ్‌బొల్లా లక్ష్యాలపై దాడులు..!
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా(Hezbollah)కు చెందిన కీలక లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం నేడు దాడులు చేపట్టింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ ఎక్స్ ఖాతాలో కూడా ధ్రువీకరించింది. లెబనాన్ నుంచి గత కొన్నాళ్లుగా తరచూ దాడులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా.. రాజకీయ, సైనిక, సామాజిక కార్యక్రమాల్లో చాలా బలంగా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని అమాయక ప్రజలపై దాడి చేసిన హమాస్‌కు ఇది మద్దతు ప్రకటించింది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై, ట్యాంక్‌లపై దాడులకు పాల్పడుతోంది. హమాస్ […]