Delhi Fire Accident: దేశ రాజధానిలో ఘోరం.. బేబీ కేర్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు శిశువుల మృతి..

Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుర్ఘటన తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని పిల్లల ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. Baby Care Center Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మృతి చెందారు.. మరికొందరు కొనఊపిరితో […]

AP Rains Update: తీవ్రరూపం దాల్చుతోన్న ‘రెమాల్‌’ తుపాను.. ఆంధ్రాలో ఈ ప్రాంతాల్లో కుండపోత వాన!

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో.. వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్స్కు 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం.. విశాఖపట్నం, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను.. తీవ్ర […]

Gang War In Udupi Video Goes Viral In Social Media:అర్థరాత్రి రోడ్లపై అరాచకం.. 

చట్టాలు ఎంత బలంగా ఉన్నా, పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కొందరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. చట్టాలను బేకాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ శివారులో కొందరు యువకులు ఆర్టీసీ బస్సుపై చేసిన దాడి అందరికీ తెలిసిందే. సైడ్‌ ఇవ్వలేదని ఆరోపిస్తూ ఏకంగా యాభై మంది యువకులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన సంచనలంగా… ఈ ఘటన సంచనలంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన సినిమాను […]

Kolkata Vs Hyderabad: సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢీకొట్టబోయే హైదరాబాద్‌ బలాలపై కోల్‌కతా మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా – హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్ గౌతమ్ […]

T20 World Cup: మిషన్ టీ20 ప్రపంచకప్.. నేడు అమెరికాకు బయల్దేరనున్న టీమిండియా.. తొలి బ్యాచ్‌లో ఎవరున్నారంటే?

Team India: నివేదికల ప్రకారం, టీమిండియా మొదటి బ్యాచ్ ఈ రోజు న్యూయార్క్ బయలుదేరుతుంది. అక్కడ జట్టు తన ప్రాక్టీస్ మ్యాచ్ జూన్ 1న ఆడాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఇందులో చేరనున్నారు. దీంతో పాటు శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కూడా తొలి బ్యాచ్‌తో […]

Kalki – Naga Chaitanya: బుజ్జి క్రేజ్‌ మామూలుగా లేదు.. నిన్న బిగ్‌బీ.. నేడు చైతన్య!

ప్రస్తుతం టాలీవుడ్‌లో  ఎక్కడ చూసినా బుజ్జి టాపిక్కే నడుస్తోంది. బుజ్జి అంటే మనిషి కాదు. పభాస్‌ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఎడి’ చిత్రంలో కీలక పాత్ర పోషించే కారు అది. ఇటీవల ‘బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్‌. ప్రస్తుతం టాలీవుడ్‌లో  ఎక్కడ చూసినా బుజ్జి (Bujji) టాపిక్కే నడుస్తోంది. బుజ్జి అంటే మనిషి కాదు. పభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఎడి’ (Kalki 2898 Ad) చిత్రంలో కీలక పాత్ర పోషించే […]

YS. SHARMILA :లండన్‌లో విహరిస్తున్న జగన్‌కు ఆడబిడ్డల ఆర్తనాదాలు పట్టవా?

‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు  వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఈనాడు, అమరావతి: ‘లండన్‌లో పొర్లు దండాల మధ్య విహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కి రాష్ట్రంలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు  వినపడవా?’ అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. జగన్‌ పాలనలో మహిళల భద్రతపై దేశమంతా చర్చించుకుంటోందని ఆమె విమర్శించారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థి […]

Bangalore Rave Party: రేవ్‌ పార్టీలో వైకాపా మూలాలు!

కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైకాపా కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈనాడు-చిత్తూరు, కడప, నెల్లూరు: కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న ఏ-2 అరుణ్‌కుమార్‌కు వైకాపా కీలక నేతలతో సంబంధాలున్నట్లు వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మడవనేరికి చెందిన నిందితుడు మాదకద్రవ్యాల […]

GV Anjaneyulu: హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదు?: జీవీ ఆంజనేయులు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంపై తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతి: కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలబడుతున్నారని నిలదీశారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనని తెలిపారు. విధుల్లో ఉన్న సీఐని కొట్టి గాయపరిచినా అరెస్టుకు ఎందుకంత భయమన్నారు. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంటున్నా పోలీసుల్లో కనీస చలనం లేదని ఎద్దేవా […]

CPM, CPI LEADERS MEET CM REVANTHREDDY :సీఎం రేవంత్‌ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెజస నేతల భేటీ

సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌: సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు.  ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి […]