Hamburg – విమానాశ్రయంలో వీడిన ఉత్కంఠ

జర్మనీలోని హాంబర్గ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్కంఠకు తెరపడింది. విమానాశ్రయంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన దుండగుడిని 18 గంటల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద ఉన్న అతడి కుమార్తె కూడా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ దుండగుడు కారు సాయంతో విమానాశ్రయంలోకి దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా  గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ పరిణామంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు […]

High-speed aircraft – శరవేగంతో పయనించే భవిష్యత్‌తరం విమానం

సైన్స్‌ కాల్పనిక సాహిత్యాన్ని తలపించే విమానం వాస్తవ రూపంలోకి రానున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న లోహవిహంగాల ఆకృతి, వేగం త్వరలో మారనుంది. ‘స్కై ఓవీ’ పేరుతో ఒక వినూత్న విమాన డిజైన్‌ను బార్సిలోనాకు చెందిన డిజైనర్‌ ఆస్కార్‌ వినల్స్‌ రూపొందించారు. దాని ఊహా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘భవిష్యత్‌తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఆస్కార్‌ వినల్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. […]

KEADARNATH – రాహుల్‌ గాంధీ కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ మందిరాన్ని దర్శించారు. ప్రైవేటు హెలికాప్టర్‌లో మందిరం చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాగతం పలికారు. ‘‘ఈ రోజు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ థామ్‌ను దర్శించి పూజ చేసుకున్నాను. హర్‌ హర్‌ మహాదేవ్‌’’ అని రాహుల్‌ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. సాయంత్రం హారతిలోనూ పాల్గొన్నారు. ‘ఛాయ్‌ సేవా’లో భాగంగా యాత్రికులకు టీ అందించారు. రాత్రికి రాహుల్‌ అక్కడే బస చేస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Delhi – ట్రక్కుల ప్రవేశంపై నిషేధం

దేశ రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా దిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌ 4 వాహనాలను మాత్రమే రాజధాని ప్రాంతంలోకి అనుమతించాలని పేర్కొంది.. హైవేలు, రోడ్లు, […]

Manipur – మొబైల్‌ ఇంటర్నెట్‌పై నిషేధం 8 వరకు పొడిగింపు

మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌పై మణిపుర్‌లో విధించిన నిషేధాన్ని ఈ నెల 8 వరకు పొడిగించారు. మణిపుర్‌ రైఫిల్స్‌ శిబిరంపై ఇటీవల జరిగిన దాడి తర్వాత ఈ నిషేధాన్ని విధించారు. విద్వేషాన్ని ఎగదోసే సందేశాలు, ఛాయాచిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించవచ్చనే ఉద్దేశంతో దీనిని పొడిగించాలని నిర్ణయించారు. సెప్టెంబరులో కొన్నిరోజులు మినహా మే 3 నుంచి ఎప్పటికప్పుడు నిషేధాన్ని పొడిగిస్తూ వస్తున్నారు.

Kerela – భారీ వర్షాలు ఆదివారం రాష్ట్రాన్ని ముంచెత్తాయి

భారీ వర్షాలు ఆదివారం కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అధిక వర్షపాతం నమోదవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పథనంథిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో అతి భారీ వర్షాల కారణంగా ఆరెంజ్‌ హెచ్చరికను.. అలప్పుజ, ఎర్నాకులం, పాలక్కడ్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. దక్షిణ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా కేరళలో వర్షాలు పడుతున్నట్లు ఐఎండీ పేర్కొంది. దక్షిణ తమిళనాడుతో పాటు పొరుగు ప్రాంతాల్లో వాయుగుండం […]

Israle-Hamas Conflict : గాజాపై యుద్ధానికి అమెరికాదే పూర్తి బాధ్యత

అమెరికా యుద్ధ నౌకలకు(US Naval Fleet) బయపడేది లేదని మిలిటెంట్‌ గ్రూప్‌ హెజ్‌బొల్లా(Hezbollah) చీఫ్‌ హసన్‌ నస్రల్లా పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం(Israel-Hamas Conflict) లెబనాన్‌లోకి విస్తరించేందుకు అన్ని మార్గాలు తెరుచుకొని ఉన్నాయన్నారు. హమాస్‌ మిలిటెంట్లు- ఇజ్రాయెల్‌ సైన్యం(IDF) మధ్య యుద్ధం మొదలైన ఇన్ని రోజుల తర్వాత హెజ్‌బొల్లా అధిపతి నస్రల్లా తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. గాజాపై యద్ధానికి అమెరికాదే బాధ్యత అన్నారు. పాలస్తీనా భూభాగంలో దాడులను ఆపడం ద్వారా ప్రాంతీయ మంటలను వాషింగ్టన్‌ నిరోధించగలదన్నారు. ఈయుద్ధం ఒక […]

Attack – గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌…

గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ శుక్రవారం మరో భారీ దాడికి పాల్పడింది. గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్‌-షిఫా ప్రాంగణంపై రాకెట్లను ప్రయోగించింది. దీంతో అంబులెన్సు వాహనశ్రేణి ఛిద్రమయింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించాయి. అంబులెన్సుల బయట చాలా మృత దేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని ఏఎఫ్‌పీ పాత్రికేయుడు ఒకరు తెలిపారు. ఇందులో మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై ఇజ్రాయెల్‌ ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. అయితే అల్‌ […]

Diabetes – 14 రోజుల్లోనే నియంత్రణ!

భారత్‌లో మధుమేహ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, ఆహారం, మధుమేహాన్ని నియంత్రించే లక్షణాలు కలిగిన బీజీఆర్‌-34 వంటి మూలికా ఔషధాలతో రక్తంలో చక్కెర స్థాయిని 14రోజుల్లోనే నియంత్రించొచ్చని వారు గుర్తించారు. పట్నాకు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో భాగంగా.. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిపై వారు దృష్టి సారించారు. […]

Nepal – భారీ భూకంపం..

నేపాల్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.  6.4 తీవ్రతతో భూకంపం శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే […]