Etala Rajender – భాజపా, భారాస ఒక్కటైతే.. గజ్వేల్‌లో నేనెందుకు పోటీ చేస్తా?

 సీఎం కేసీఆర్‌ పాలనలో భారాస కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, రైతులు..  ఎవరూ సంతోషంగా లేరన్నారు. అసైన్డ్‌, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని.. రూ. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. భాజపా, భారాస ఒక్కటైతే తానెందుకు గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు. భారాస పాలనతో […]

Chhattisgarh – అంజోరా గ్రామంలో ఇద్దరు ఎమ్మెల్యేలు!

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్‌లోని అంజోరా గ్రామంలో నాయకుల ప్రచారం హోరెత్తుతోంది. అయిదు వేల జనాభా ఉన్న ఈ గ్రామం రెండు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ఉండటం ప్రత్యేకత. అటు దుర్గ్‌, ఇటు రాజనందగావ్‌ జిల్లాల పరిధిలో రెండు భాగాలుగా ఈ గ్రామం ఉంది. గ్రామ వీధుల్లో ఒక వరుస రాజనందగావ్‌ సెగ్మెంటు పరిధిలోకి వస్తే, మరో వరుస దుర్గ్‌ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గ్రామంలోని కొన్ని కుటుంబాల ఓట్లు రెండు నియోజకవర్గాల మధ్య చీలి […]

NARENDRA MODI – ఆదివాసీలను పట్టించుకోని కాంగ్రెస్‌..

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. రాష్ట్రంలో తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించడానికి, పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ కలహించుకుంటూనే ఉంటారని ఆరోపించారు. ‘రాముడిని పురుషత్తముడిని చేసిన గిరిజనులకు మేం శిష్యులం, వారి ఆరాధకులం’ అని మోదీ శివనీ జిల్లాలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. కుంభకోణాలు జరగకుండా చేయడంతో ఆదా అయిన నగదుతోనే గరీబ్‌ కల్యాణ్‌ అన్న […]

KCR – హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను పైలట్‌ గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే హెలికాప్టర్‌ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్‌ చేశారు. మరోవైపు ఏవియేషన్‌ సంస్థ ప్రత్యామ్నాయ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆ హెలికాప్టర్‌ రాగానే సీఎం పర్యటన యథావిథిగా కొనసాగనుంది.

Turkey : ఉద్రిక్తంగా మారిన పాలస్తీనా మద్దతుదారుల ర్యాలీ..

గాజాపై ఇజ్రాయెల్‌ (Israel) దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా ( Palestine)కు మద్దతుగా తుర్కియే ( Turkey)లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొద్ది గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు […]

Russia – దాడిలో రష్యా యుద్ధనౌక ధ్వంసం

రష్యా ఆధీనంలోని క్రిమియాలో ఉన్న కెర్చ్‌ నగరంపై ఉక్రెయిన్‌ సైన్యం విరుచుకుపడింది. ఒక్కసారిగా 15 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 13 అస్త్రాలను రష్యా కూల్చేసింది. ఓ క్షిపణి రష్యాకు చెందిన అత్యాధునిక యుద్ధనౌకను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నష్టం తీవ్రత ఎంతన్నది వెల్లడి కాలేదు. దెబ్బతిన్న నౌకలో కల్బిర్‌ క్షిపణులు ఉన్నట్లు ఉక్రెయిన్‌ వాయుసేన కమాండర్‌ మైకొలా ఒలెస్చుక్‌ తెలిపారు. ‘‘మరో నౌక మాస్కోవా బాట పట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ […]

JUBLIEHILLS – కుమార్తె కళ్లెదుటే తండ్రి ఆత్మహత్య

కన్నబిడ్డకు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు లేదన్న బాధతో ఆమె ఎదుటే తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ హుస్సేనీ అలంలో నివాసం ఉంటున్న ఏఆర్‌ఎస్సై ఫాజిల్‌ అలీ(59) ఏడాదికాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. వారికి విడాకులు కావడంతో పుట్టింట్లోనే ఉంటున్నారు. కుమారుడు సంతోష్‌నగర్‌లో చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. మూడో కుమార్తె ఆసియా ఫాతిమాకు పెళ్లి చేయాలని భావించారు. […]

Chhattisgarh- మావోయిస్టుల ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేరు జిల్లాలోని తడోకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు దళాలు-భద్రతా బలగాల మధ్య ఆదివారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఆర్జీ, బీఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు తడోకీ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టాయి. ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు వీరికి తారసపడి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఆత్మరక్షణకు తిరిగి కాల్పులు ఆరంభించడంతో మావోయిస్టులు గాయాలపాలై అక్కడినుంచి తప్పించుకు వెళ్లిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టు […]

Test-fired – ఖండాంతర క్షిపణిని పరీక్షించిన రష్యా

అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఉక్రెయిన్‌ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇప్పటికే అణు పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఒక బిల్లుపై ఇటీవల సంతకం చేశారు. అమెరికాతో సమాన స్థాయిని సాధించడానికి ఇది అవసరమని రష్యా పేర్కొంది. తాజా పరీక్షలో […]

USA : పశ్చిమాసియాకు అణు జలాంతర్గామిని తరలించిన అమెరికా..!

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముదిరే కొద్దీ అమెరికా తన శక్తిమంతమైన ఆయుధ వనరులను పశ్చిమాసియాకు తరలిస్తోంది. ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒహియో శ్రేణి అణు జలాంతర్గామిని ఈ ప్రాంతంలో మోహరించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ట్విటర్‌లో ప్రకటించింది. అమెరికా నౌకా దళంలో మొత్తం నాలుగు ఒహియో శ్రేణి జలాంతర్గాములున్నాయి. కచ్చితంగా దేనిని అక్కడికి తరలించిందో మాత్రం వెల్లడించలేదు. యూఎస్‌ఎస్‌ ఫ్లోరిడా మాత్రం ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తోంది. ఈ […]