Indonesia – వణికించిన వరుస భూ ప్రకంపనలు..!

ఇండోనేషియా మరోసారి ఉలిక్కిపడింది. శక్తిమంతమైన భూ ప్రకంపనలు (Earthquake) ఇండోనేషియా దీవులను వణికించాయి. వీటిలో కొన్ని రిక్టర్‌ స్కేలుపై 6.9, 7.0 తీవ్రతతో నమోదు కాగా.. మరో రెండుసార్లు 5.1 తీవ్రతతో సంభవించాయి. ఇలా వరుసగా తీవ్ర స్థాయిలో భూమి కంపించినప్పటికీ.. సునామీ (Tsunami) ప్రమాదం లేదని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం వెల్లడించింది. అయితే, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. భూకంపం నేపథ్యంలో అక్కడ ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అమెరికా […]

Hamas: అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన..

అమెరికా ప్రతినిధుల సభలో అరుదైన ఘటన చోటు చేసుకొంది. పాలస్తీనా మూలాలున్న ఏకైక సభ్యురాలు రషీద త్లైబ్‌ ఇజ్రాయెల్‌-హమాస్‌ వార్‌పై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో ‘నదుల నుంచి సముద్రాల వరకు’ అనే పదం వాడారు. ఇజ్రాయెల్‌ నిర్మూలనను సూచించే విధంగా దీనిని వాడారంటూ చాలా మంది సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసంగాన్ని సెన్సార్‌ చేసేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. దీనిలో 234-188 మెజార్టీతో దీనికి ఆమోదం లభించింది. ముఖ్యంగా […]

Human Trafficking : ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు

మానవ అక్రమ రవాణా (Human Trafficking) కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా దాడులు చేసింది. బుధవారం ఎనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ దాడులు చేపట్టినట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉన్న మయన్మార్‌కు చెందిన వ్యక్తిని జమ్మూలో ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, త్రిపుర, రాజస్థాన్‌, […]

Ravi Teja – త్వరలో చూస్తారు విశ్వరూపం

అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు కానీ, వ్యాపించి ఉంటాడు. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకీ…  అతడి బుల్లెట్‌ వెళుతుంది. ఇంతకీ అతనెవరో తెలియాలంటే ‘ఈగల్‌’ చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా… కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌, కావ్య థాపర్‌ కథానాయికలు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న దక్షిణాది భాషలతోపాటు హిందీలోనూ ఈ చిత్రం విడుదలవుతోంది. సోమవారం టీజర్‌ని విడుదల చేశారు. ‘కొండలో లావాని కిందకి పిలవకు… ఊరూ  ఉండదు, నీ ఉనికీ ఉండదు’ […]

Bigg Boss Telugu 7 : స్‌ హౌస్‌లోకి శివాజీ కుమారుడు..

బిగ్‌బాస్‌ సీజన్‌ 7 (Bigg Boss Telugu 7) ఉల్టా పుల్టా నిజంగా ఇలానే సాగుతోంది. తీవ్రంగా అరుచుకోవడం.. అంతలోనే కలిసి పోతూ కంటెస్టెంట్‌లు ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇక బిగ్‌బాస్‌ కూడా టాస్క్‌లతో ఏడిపిస్తూనే సర్‌ప్రైజ్‌లతో ఆనందాన్ని నింపుతున్నాడు. తాజాగా బిగ్‌బాస్‌ ఇచ్చిన ఎమోషనల్‌ సర్‌ప్రైజ్‌కు శివాజీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. హౌస్‌లో కూర్చొని కాఫీ తాగుతున్న శివాజీని డాక్టర్‌తో చెక్‌ చేయించాలని మెడికల్‌ రూమ్‌కు రమ్మని పిలిచాడు. అక్కడ డాక్టర్ అతడితో మాట్లాడుతూ.. […]

Bhutan – పురోగతికి తోడ్పాటు

భూటాన్‌ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భారత్‌ పూర్తిస్థాయి తోడ్పాటు అందిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యెల్‌ వాంగ్‌చుక్‌ సోమవారం మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల గుండా  సంధానతను పెంచుకోవాలని, వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగాల్లో సంబంధాలను వృద్ధి చేసుకోవాలని ఇద్దరు నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ సమావేశం అనంతరం ఒక సంయుక్త ప్రకటన వెలువడింది. అస్సాంలోని కోక్రాఝార్‌ నుంచి భూటాన్‌లోని […]

Israel – కాస్త తగ్గుతోందా..?

హమాస్‌(Hamas)ను భూస్థాపితం చేసేవరకు గాజాపై తమ దాడులు ఆపమన్న ఇజ్రాయెల్(Israel) .. భీకర ఘర్షణలకు ప్రదేశాల వారీగా స్వల్ప సడలింపులు ఇచ్చేందుకు మాత్రం ముందుకువచ్చింది. మానవతా సాయం, బందీల విడుదల కోసం గాజాలో వ్యూహాత్మక విరామాలను పరిశీలిస్తామని వెల్లడించింది. (Israel Hamas Conflict) ‘మానవతా సాయాన్ని సులభతరం చేయడానికి, బందీలను విడిపించేందుకు వ్యూహాత్మక స్వల్ప విరామాలను మా దేశం పరిశీలిస్తోంది’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు(Benjamin Netanyahu) తెలిపారు. అమెరికా శ్వేతసౌధ ప్రతినిధి జాన్‌ కిర్బీ […]

Delhi – 13 నుంచి సరి-బేసి విధానం

ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన కాలుష్య నియంత్రణకు దిల్లీలో ఈ నెల 13 నుంచి  వాహనాలకు సరి-బేసి అంకెల విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది ఈ నెల 20 వరకూ కొనసాగనుంది. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి అంకె ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి అంకె ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి అనుమతిస్తారు. ఈ మేరకు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్‌ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయులకు ఏడెనిమిది రెట్ల కాలుష్యం […]

Manipur – ఉచ్చులో కమాండోలు..

చొరబాటుదారుల ఉచ్చులో చిక్కుకున్న మణిపుర్ పోలీసు కమాండోల (Manipur Police commandos )ను సైన్యానికి చెందిన అస్సాం రైఫిల్స్‌ (Assam Rifles) బృందం కాపాడింది. కొండపై నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుంటే డేరింగ్‌ ఆపరేషన్‌ చేపట్టి వారిని రక్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే..? అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో ఇటీవల ఓ సీనియర్‌ పోలీసు అధికారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మోరే […]

Kejriwal – అవినీతిపై మోదీ పోరు ఓ నాటకం

అవినీతిపై పోరాడుతున్నట్లు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు చెప్పడం ఓ నాటకమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. తప్పుడు పనులు చేస్తున్నవారిగా భాజపా ఆరోపించేవారంతా ఆ పార్టీలో చేరిన తర్వాత మంత్రివర్గాల్లో స్థానం పొందుతుంటారని ఎద్దేవా చేశారు. హరియాణాలోని రోహ్‌తక్‌లో ఆదివారం ఆప్‌ నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ‘ఓ భారీ నేరమో, పెద్ద పాపమో చేసినవారు భాజపాలో చేరిపోతే వారి జోలికి వెళ్లేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి విభాగాల అధికారులు సాహసించరు. ఈడీకి చిక్కి, […]