Balakrishna – 109వ చిత్రం ప్రారంభం

‘భగవంత్‌ కేసరి’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. ఇది ఆయనకి 109వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం గొడ్డలి, కళ్లద్దాలతో కూడిన ఓ ప్రచార చిత్రాన్ని […]

UK – ‘లాఫింగ్‌ గ్యాస్‌’పై నిషేధం

లాఫింగ్‌ గ్యాస్‌గా పిలిచే నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినోదభరిత కార్యకలాపాల కోసం వినియోగించడంపై బ్రిటన్‌ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. ఆ డ్రగ్‌ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటివి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణతోపాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్‌ ఆక్సైడ్‌ను వినియోగించడాన్ని నిషేధం నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. యూకేలో 16-24 ఏళ్ల వయసువారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో […]

Gurugram-Jaipur Express – స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

గురుగ్రామ్‌-జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో అవి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఝార్సా ఫ్లై ఓవర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

GAZA – మత్తు మందు ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్ర చికిత్సలు..

గాజాలో వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడంతో అనస్థీషియా (మత్తు మందు) ఇవ్వకుండానే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికీ నీరు లేకపోవడంతో గాయాలపాలైనవారు నరకం చూస్తున్నారు. గాజాలో తమ ప్రాణాలు పోతాయని తెలిసినా పాలస్తీనా వైద్యులు, నర్సులు యుద్ధ క్షేత్రంలో సేవలందిస్తున్నారని, వారే నిజమైన హీరోలని అమెరికాకు చెందిన నర్సు ఎమిలీ కల్లాహన్‌ పేర్కొన్నారు. గాజాలో మొన్నటివరకూ సేవలందించిన ఆమె.. అక్కడ ఎదురవుతున్న సవాళ్లు, పౌరుల దీనస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. […]

China : రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిపాదన.

సైనిక ఉపగ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందున మరింతగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. బుధవారం చైనా సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ జెన్‌ ఝాంగ్‌ యుక్సియాతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాట్లాడారు. ‘అంతరిక్షంతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి విలువైన ఆస్తుల్లో, భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆయుధాల విషయంలో సహకరించుకోవడం ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక […]

US strike : సిరియాలోని ఇరాన్‌ మద్దతున్న దళాలపై దాడి..

సిరియా (Syria)లోని ఇరాన్‌ (Iran) మద్దతున్న సాయుధ బలగాలపై అమెరికా (USA) రెండోసారి గగనతల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ చీఫ్‌ రమీ అబ్దెల్‌ రెహమాన్‌ వెల్లడించారు. ఇరాక్‌, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మద్దతున్న సాయుధ బలగాలు గత కొన్ని రోజుల్లో 12 సార్లు దాడి చేశాయి. వాటికి ప్రతీకారంగానే అమెరికా ఈ దాడులు చేస్తోంది. గాజాలో జరుగుతోన్న సంక్షోభానికి ఈ […]

Air Pollution – కాలుష్యంపై పోరు.. ‘కృత్రిమ వర్షానికి’ సిద్ధమవుతోన్న దిల్లీ!

రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) విధానంలో కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 20-21 తేదీల్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది. క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యానికి చెక్‌ […]

Yemen : అమెరికా డ్రోన్‌ను కూల్చేసిన హౌతీ తిరుగుబాటు దళాలు

అమెరికా(USA)కు చెందిన ఎంక్యూ-9 రిమోట్లీ పైలెటెడ్‌ డ్రోన్‌ను యెమెన్‌ (Yemen) లోని హౌతీ (Houthi) తిరుగుబాటు దళాలు కూల్చేశాయి. తమ భూభాగంపై నిఘా పెట్టి.. గూఢచర్యానికి పాల్పడుతున్న అమెరికా డ్రోన్‌ను యెమెన్‌ తీరప్రాంతంలో తమ బలగాలు కూల్చేసినట్లు హౌతీ వెల్లడించింది. అమెరికా రక్షణశాఖ అధికారులు సైతం ఈ దాడిని నిర్థారించారు. ఇజ్రాయెల్‌కు మిలటరీ సాయంలో భాగంగానే తమపై అమెరికా డ్రోన్లతో నిఘా పెట్టిందని ఈ గ్రూప్‌ ఆరోపిస్తోంది. ఇరాన్‌ మద్దతున్న హౌతీలు ఇజ్రాయెల్‌పై పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. […]

P.Balasubramanian Menon – 97 ఏళ్ల వయసులోనూ కేసులు వాదిస్తున్నారు

ఆయన వయసు 97 ఏళ్లు. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన ఆ వయసులో ఆయన ఇప్పటికీ కోర్టుకు హాజరై కేసుల్ని వాదిస్తున్నారు. అత్యధికంగా 73 ఏళ్ల 60 రోజులు నాయ్యవాదిగా పనిచేసి, ఏకంగా గిన్నిస్‌ రికార్డులకెక్కారు. ఈ రికార్డును సెప్టెంబరు 11న గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధ్రువీకరించింది. కేరళకు చెందిన ఈ న్యాయవాది పేరు పి.బాలసుబ్రమణియన్‌ మీనన్‌. అంత ముదిమి వయసులోనూ మీనన్‌ ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. తన కార్యాలయానికి, కోర్టుకు హాజరవుతూ […]

Kerala – ఏ ఆకు కూరతో ఏం లాభమంటే..!

కేరళలోని కోజికోడ్‌లోని పుక్కాడ్‌కు చెందిన వన్నంగుని అబూబాకర్‌ (82) ఆకు కూరలతో కలిగే ప్రయోజనాలను యువతకు వివరిస్తూ తనకున్న భూమిలో దాదాపు 50 రకాల ఆకుకూరలను పండిస్తూ ప్రసిద్ధి చెందారు. కంటి సమస్యలు, ఊబకాయం, రక్తహీనత, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడాలంటే ఆకు కూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. మనకు దొరికే ఆకుకూరల్లోనే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. స్థానికంగా జరిగే వ్యవసాయ సమ్మేళనాల్లో పాల్గొని.. అక్కడ వేల […]