Maxwell – ఇన్నింగ్స్‌ వెనుక నిక్‌

 ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే కనీసం క్రీజులో నిల్చోడానికే ఇబ్బంది పడిన మ్యాక్స్‌వెల్‌ను ఇన్నింగ్స్‌ కొనసాగించేలా చేసింది మాత్రం ఫిజియో నిక్‌ జోన్స్‌ సలహానే. మంగళవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో కాళ్లు పట్టేయడం.. తీవ్రమైన తిమ్మిర్లతో బాధపడిన మ్యాక్స్‌వెల్‌ ఒకదశలో రిటైర్‌ అవ్వాలని అనుకున్నాడు. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సైతం అందుకు అడ్డు చెప్పలేదు. కానీ ఆసీస్‌ గెలవాలంటే మ్యాక్స్‌వెల్‌ కచ్చితంగా క్రీజులో ఉండాలని భావించిన నిక్‌.. […]

Smartwatch : సీఈఓ ప్రాణాలు కాపాడింది

టెక్నాలజీతో కొన్ని ప్రతికూలతలు ఉన్న మాట వాస్తవమే అయినా.. వాటి వల్ల జరిగే మేలునూ విస్మరించకూడదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన ఓ కంపెనీ సీఈవోను స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) కాపాడింది. ఆ వాచ్‌ సాయంతో సమయానికి ఆ సీఈఓ తన భార్యకు సమాచారం ఇవ్వడం.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన ప్రాణాలు నిలిచాయి. స్మార్ట్‌వాచే తనను కాపాడిందని ఆ సీఈఓనే స్వయంగా పోస్ట్‌ చేశారు. యూకేకు చెందిన 42 ఏళ్ల […]

Ponguleti Srinivas Reddy – నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌, ఖమ్మంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఖమ్మంలో గురువారం వేకువజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ  అధికారులు.. మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్‌ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసంపై ఐటీ దాడులు జరగొచ్చని […]

Barrelakka Sirisha – కొల్లాపూర్‌లో నామినేషన్‌ వేశారు

తనపై కేసు పెట్టడంతో నిరసనగా నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష బుధవారం కొల్లాపూర్‌లో రిటర్నింగ్‌ అధికారి కుమార్‌దీపక్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు… రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి యూట్యూబ్‌, సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు నమోదు […]

Nara Lokesh – వైకాపావి ఫేక్ ఎత్తుగడలు, అప్రమత్తంగా ఉండండి.

కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు.. తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం: తెదేపా రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే […]

Tesla – భారత్‌కు కార్లు.. వయా జర్మనీ

టెస్లా సంస్థ జర్మనీలోని తమ గిగాఫ్యాక్టరీ నుంచి భారత్‌కు విద్యుత్‌ కార్లను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. చైనాలోని షాంఘైలోనూ గిగాఫ్యాక్టరీ ఉన్నా, అక్కడ నుంచి విద్యుత్‌ కార్ల దిగుమతికి భారత అధికారులు ససేమిరా అనడంతో టెస్లా ఈ యోచన చేస్తున్నట్లు ఆంగ్ల వార్తా సంస్థ ‘మనీకంట్రోల్‌’  పేర్కొంది. టెస్లాకు ఐరోపాలో తొలి ఫ్యాక్టరీ కూడా జర్మనీ గిగాఫ్యాక్టరీనే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన టెస్లా, 25,000 డాలర్ల (రూ.20 లక్షలపైన) కార్లను భారత మార్కెట్లోకి తీసుకురావాలని […]

CM KCR – గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన అందజేశారు. నామినేషన్‌ అనంతరం కేసీఆర్‌ ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

Software Engineer: మహిళా టెకీతో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో మహిళ పక్క సీట్లోనే నిందితుడు కూర్చున్నాడు. నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్లు గుర్తించి, ఆమె మేల్కొంది. వెంటనే విమానయాన సిబ్బందికి తెలిపింది. బెంగళూరుకు విమానం చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో […]

RAMOJI Film City – ‘పుష్ప’.. ‘సలార్‌’ ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీ భారీ సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉంది. ఓ వైపు ‘పుష్ప 2’ మరోవైపు ‘సలార్‌’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాయి చిత్ర బృందాలు. పాటన్నా… పుష్ప ఫైట్‌ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఉండాల్సిందే. ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే మామూలుగా ఉంటుందా? జాతరంత సందడి కనిపించి తీరాల్సిందే. ‘పుష్ప 2’ కోసం సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటని తెరకెక్కిస్తున్నారు. గణేశ్‌ ఆచార్య ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. […]

Rashmika – మద్దతుగా చిత్రసీమ..

ప్రముఖ కథానాయిక రష్మికని లక్ష్యంగా చేసుకుని సృష్టించిన డీప్‌ఫేక్‌ వీడియోపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకి మద్దతుగా నిలుస్తున్నారు. మహిళల రక్షణకి భంగం కలిగించే ఇలాంటి నకిలీలపైనా, సాంకేతికతపైనా చర్చ జరుగుతుండగా ఇలాంటి వీడియోల్ని సృష్టిస్తున్నవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ రష్మికకి అండగా నిలిచారు. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ… ‘‘మరో మహిళకి […]