Pushpa 2: పతాక సన్నివేశాల్లో… ‘పుష్ప2’

ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. చిత్రీకరణ దాదాపుగా తుది దశకు చేరుకొంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని తెరకెక్కించడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. ఈ వారం నుంచి రెండు వారాలుపైగానే పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతోపాటు, కొన్ని  టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా… సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. […]

Ajith – Nayanthara as a couple again ? అజిత్‌ – నయనతార మరోసారి జంటగా?

అజిత్‌ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అజిత్‌ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్‌ కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం […]

USA: The threat of tornadoes in America : అమెరికాలో టోర్నడోల బీభత్సం…..

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి ధాటికి ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వ్యాలీ వ్యూ (టెక్సాస్‌): అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్‌లను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీటి ధాటికి ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో ఓక్లహామా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సానికి ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. […]

Former minister Yerneni Sita Devi passed away due to heart attack :గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్‌ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో ఆమె తుదిశ్వాస విడిచారు.  సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్‌(చిట్టిబాబు) […]

Gadari Kishore: Congress Party Candidate Blackmailer : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్: గాదరి కిషోర్‌….

హైదరాబాద్‌: ఎల్లుండి (సోమవారం) జరిగే  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉండే నల్గొండ పట్టభద్రులు వెళ్లి ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ నేత గాదరి కిషోర్‌ కుమార్‌ కోరారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో మాట్లాడారు.  ‘‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మొత్తం ఇలాగే ఉంది. వందలాది కేసులు ఉన్న వ్యక్తి మల్లన్న. బ్లాక్ మెయిల్‌ కేసులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సీఎం అవ్వగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. గత ప్రభుత్వం […]

KTR:If more jobs are given than us, I will resign: మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా…

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ […]

CM Revanth’s decision on Jayajayahe Telangana song : జయజయహే తెలంగాణ గీతంపై సీఎం రేవంత్‌ నిర్ణయం..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్‌ […]

సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దు

అమరావతి: డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ స్టాంప్‌ (సీల్‌) లేదన్న ఏకైక కారణంతో పోస్టల్‌ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జూన్‌ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపులో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంచేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ ­కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్ని­కల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంతమంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు […]

PERNI NANI : పిన్నెల్లి హత్యకు పథకం: పేర్ని నాని ఆందోళన

అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటాడి హత్య చేసేందుకు పోలీసుల ద్వారా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని  ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి ప్రాణాలకు ఎలాంటి హాని జరిగినా సీఐ నారాయణస్వామి, గుంటూరు రేంజ్‌ ఐజీ, డీజీపీదే బాధ్యతని స్పష్టం చేశారు. సీఐ నారాయణస్వామిని అడ్డు పెట్టుకుని తనను అంతమొందించేందుకు టీడీపీ నేతలు కుట్ర చేస్తున్నట్లు ఈసీ, పోలీసు ఉన్నతాధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన  ఇంటి వద్ద బందోబస్తు […]

AP Elections: లండన్ వెళ్లిన జగన్ తిరిగి వస్తారో.. రారో..!!: వర్ల రామయ్య

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి […]