#Ranga Reddy District

Rangareddy – మూడేళ్ల కఠిన కారాగార శిక్ష.

రంగారెడ్డి:ఏడేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి రూ. 5,000 మరియు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్‌ మౌలాలి (22) నగరానికి వెళ్లి ప్రస్తుతం మియాపూర్‌లోని ప్రశాంత్‌నగర్‌లో వాషింగ్‌ మిషన్‌ మెకానిక్‌గా ఉద్యోగం చేస్తున్నాడని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొంగర రాజిరెడ్డి కథనం. 2019 ఫిబ్రవరి 7న సెరిలింగంపల్లి మండలంలోని ఓ ఇంటికి వాషింగ్‌ మిషన్‌ అమర్చేందుకు వెళ్లారు. ఆ ఇంట్లో ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై మౌలాలి అసభ్యంగా ప్రవర్తించాడు. కేసు విచారణకు అధ్యక్షత వహించిన మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి పట్టాభిరామారావు తీర్పును ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *