Yarapathineni Srinivasa Rao – TDP ( Gurazala )

యరపతినేని శ్రీనివాస రావు గారికి 7 వ సారి గురజాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఆయనకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీలోకేష్ గారికి, మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.దశాబ్దాలుగా తనను ఇంతగా ఆదరిస్తున్న నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉండవల్లి లోని వారి నివాసంలో యరపతినేని గారు కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరు కలిసి కట్టుగా పనిచేసి,మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరూ మరొకసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు.
వారి ఆశీర్వాదం బలం,ప్రోత్సాహం వల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అక్రమ కేసులను తట్టుకొని పల్నాడు జిల్లాలో ప్రజాసామ్యసలపై పోరాడగల్గుతున్నా. అని గుర్తు చేసుకున్నారు