TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. దిల్లీ పరిణామాలపై చర్చ!

తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది.
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu)తో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు.
తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చంద్రబాబు, పవన్ దిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిణామాలపై నేతలిద్దరూ మాట్లాడుకున్నట్లు సమాచారం.