#political news

Telangana – ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ.

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్‌ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1.35కి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ బయల్దేరతారు. 2.05కి అక్కడికి చేరుకుని 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు  ‘భాజపా సమరభేరి’ సభాస్థలికి చేరుకుని 4 గంటల వరకు అక్కడే ఉంటారు. సభావేదిక నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి శంషాబాద్‌ చేరుకుని అక్కడిని నుంచి విమానంలో దిల్లీ వెళ్తారు. 

తొలుత ఆయన బేగంపేట చేరుకుని అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్లనున్నట్లు గతంలో భాజపా వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

Telangana – ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ.

A fire broke out in the Ganesh

Leave a comment

Your email address will not be published. Required fields are marked *