Minister Puvvada Ajay – వచ్చే ఎన్నికల్లో 88-90 స్థానాలు గెలుస్తాం..

భారాస మేనిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోయాయని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం భారాస కార్యాలయంలో అభ్యర్థుల మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారాస సర్కార్ అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రంలోని భాజపా సర్కార్ కూడా కాపీ కొట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని మంత్రి అజయ్ ధీమా వ్యక్తం చేశారు.