Congress – 29 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక.

హైదరాబాద్ మహానగరంతో కలిపి 4 పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో 29 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌కు (Congress) కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాల్లో పేర్లు ఖరారు కాగా.. మరికొన్నింటిపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరక పంచాయితీలకు దారితీస్తున్నట్లు సమాచారం. ఈసారి ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషణ సాగిస్తోంది.