#political news

Congress Party Will Win More Than 70 Assembly Seats – ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా….

హైదరాబాద్‌: ‘ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 70కిపైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది’అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గురు వారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నల్ల గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి ఆయన విలేక రులతో మాట్లాడారు. ఈ నెల 17న రాష్ట్ర చరిత్రలో నే అరుదైన బహిరంగసభను తుక్కుగూడలో నిర్వహిస్తున్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీతోపాటు నా లుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌ జాతీ య నాయకులందరూ పాల్గొనే ఈ సభను విజయ వంతం చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉద్యోగులకు ఓపీఎస్‌ విధానాన్ని అమలు పరుస్తున్నా మని, కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీ ల్లో నాలుగింటినీ ఇప్పటికే అమలు చేశా మని చెప్పారు.

తెలంగాణలోనూ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వబోతున్నామని, సోనియాగాంధీ ఈ ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటిస్తారని చెప్పారు. ఠాక్రే మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశాలు దేశానికి మంచి సంకేతాన్ని ఇస్తాయని చెప్పారు. బహిరంగ సభ అనంతరం 18న కాంగ్రెస్‌ నాయకులందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ఐదు గ్యారంటీ కార్డు స్కీంలపై ప్రచారం చేయాలని, బీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 

Congress Party Will Win More Than 70 Assembly Seats – ఐదుసార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి ఎంపీగా గెలిచిన రాజకీయ అనుభవంతో చెప్తున్నా….

Two strange shapes believed to be alien

Leave a comment

Your email address will not be published. Required fields are marked *