#political news

CM KCR – పర్యటనలో స్వల్ప మార్పులు

భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తొలివిడత పర్యటనల్లో భాగంగా ఇప్పటికే ఈ నెల 15 నుంచి 18 వరకూ హుస్నాబాద్‌, జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. రెండో విడత పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుంచి నవంబరు 9 వరకు వరుస బహిరంగ సభలకు ఏర్పాట్లుచేశారు. 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, మునుగోడు బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉండగా.. ఇందులో నాగర్‌కర్నూల్‌ స్థానంలో వనపర్తికి బహిరంగ సభను మార్చారు. 27న పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బహిరంగ సభలకు షెడ్యూల్‌ ముందుగా ఖరారు కాగా.. తాజా మార్పుల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌కు బదులుగా మహబూబాబాద్‌, వర్ధన్నపేట చేరాయి. ఇవి మినహా మిగిలిన తేదీల్లో నియోజకవర్గాల వారీగా ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే బహిరంగ సభలు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 29న కోదాడ, తుంగతుర్తి, ఆలేరులో.. 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణఖేడ్‌లో.. 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండలో.. నవంబరు 1న సత్తుపల్లి, ఇల్లందులో.. 2న నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురిలో.. 3న బైంసా (ముదోల్‌), ఆర్మూర్‌, కోరుట్లలో.. 5న కొత్తగూడెం, ఖమ్మంలో.. 6న గద్వాల, మక్తల్‌, నారాయణపేటలో.. 7న చెన్నూరు, మంథని, పెద్దపల్లిలో.. 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లిలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. 9న మధ్యాహ్నం 1 గంటకు గజ్వేల్‌లో, 2 గంటలకు కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నామినేషన్‌ పత్రాలను సమర్పిస్తారు. అనంతరం అదే రోజు 4 గంటలకు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలు వరుసగా నియోజకవర్గాల వారీగా ప్రచార గడువు ముగిసే వరకూ నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *