Barrelakka Sirisha – కొల్లాపూర్‌లో నామినేషన్ వేశారు

తనపై కేసు పెట్టడంతో నిరసనగా నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష బుధవారం కొల్లాపూర్‌లో రిటర్నింగ్ అధికారి కుమార్‌దీపక్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు… రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి యూట్యూబ్, సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారి తీరుపై నిరసనగా నిరుద్యోగుల వాణి వినిపించడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.