Dalapati Vijay About CAA Act / సీఏఏ చట్టం.. దళపతి విజయ్ ఏమన్నారంటే?

019లో ఆమోదం పొందిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. అయితే, సీఏఏ చట్టంపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరుణంలో ప్రముఖ హీరో, దళపతి విజయ్ తన పార్టీ ‘తమిళగ వెట్రి కగళం’ తరుపున స్పందించారు. ఎక్స్.కామ్ పోస్ట్‌లో సీఏఏపై కేంద్రం నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ప్రకటన చేశారు.
‘దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి ఏ చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు’ అని దళపతి విజయ్ తమిళంలో చేసిన ప్రకటనలో ఉంది.
