#Andhra Politics #Politics

AP BJP: దిల్లీకి బయల్దేరిన దగ్గుబాటి పురందేశ్వరి

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు

అమరావతి: భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ సమర్పించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరనుందనే ప్రచారం నేపథ్యంలో పురందేశ్వరి దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *